స్టేజి మీదే రీతూ వర్మతో సింగర్ రేవంత్ పులిహోర.. అది చూసిన యాంకర్ ఏం చేసిందంటే?

ఏదైనా ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుక లేదా విజయోత్సవ వేడుక జరిగినప్పుడు ఆ వేడుకల్లో భాగంగా యాంకర్లు మాట్లాడుతూ కొన్నిసార్లు ఓవరాక్షన్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే కొందరు యాంకర్లు హీరో హీరోయిన్లకు ఇష్టం లేకపోయినా బలవంతంగా స్టేజి పైకి తీసుకువచ్చి వారితో పాటలు పాడించడం డాన్స్ లు వేయడం వంటివి చేస్తుంటారు.

 Ritu Varma, Varudu Kaavalenu, Singer Revanth, Geetha,latest Tollywood News-TeluguStop.com

తాజాగా నాగ సౌర్య రీతువర్మ నటించిన వరుడు కావలెను సినిమాకి సంబంధించి సంగీత్ అంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైన సింగర్ రేవంత్ హీరో హీరోయిన్ల ను స్టేజి పైకి తీసుకువచ్చి కాస్త ఓవర్ చేశారు.

నాగ సౌర్యను డాన్స్ వేయాలని కోరినప్పటికీ అందుకు నాగశౌర్య నేను కేవలం సినిమాల్లో మాత్రమే వేస్తాను అని సమాధానం చెప్పాడు.అయినప్పటికీ అతని డాన్స్ వేయాలని బలవంతం చేయడంతో నేను చెయ్యను నీకు చేయాలనిపిస్తే నువ్వు వేసుకో అంటూ సమాధానం చెప్పాడు.

అప్పుడు రేవంత్ మాట్లాడుతూ నేను అలా అంటే హీరో ఇలా వెళ్ళిపోతే అప్పుడు నేనే హీరోయిన్ చక్కగా డాన్స్ వేయొచ్చు కదా అంటూ అనగా ఆ మాట విన్న యాంకర్ గీత భగత్ మనసులో ఇంత ఆలోచన పెట్టుకున్నావా అంటూ నోరెళ్ళ బెట్టింది.

Telugu Geetha, Ritu Varma, Revanth-Movie

ఈ క్రమంలోనే రేవంత్ పాట పాడుతూ హీరోయిన్ ను చూస్తూ ఉండగా ఆమెను అంతగా చూడాలనుకుంటే థియేటర్ కి వెళ్లి సినిమాలో చూడు అంటూ యాంకర్ పరువుతీసింది.ఈ క్రమంలోనే హీరోయిన్ మాట్లాడుతూ రేవంత్ పాట పాడుతుంటే నాకు ప్రపోజ్ చేసినట్లు ఉంది అంటూ అతని పై సెటైర్ వేసింది.అలా చివరకు రేవంత్ తో కలిసి రెండు స్టెప్పులు వేసిన రీతువర్మ తనకన్నా నాగశౌర్యతో డాన్స్ చేయడం మంచిగా ఉందంటూ తన పరువు తీసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube