ఇప్పటి వరకు అబ్బాయిలే చేశారు.. ఇప్పుడు నేను చేసి చూపిస్తా: అరియానా

బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి అందరికీ తెలిసిందే.బోల్డ్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి షార్ప్ మాటలతో అందర్నీ తనవైపు లాక్కుంది.

 Anchor Ariyana Glory Is Back To Ask Those Bold Questions In Bigg Boss 5 Buzzbigg-TeluguStop.com

నిజానికి అతి తక్కువ సమయంలోనే బిగ్ బాస్ నుండి వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు.కానీ చివరి వరకు ఆటలో కొనసాగి తానేంటో నిరూపించుకుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత పలు ప్రాజెక్టుల తో బాగా బిజీగా మారింది.ఇదిలా ఉంటే అబ్బాయిలే కాదు నేను కూడా చేసి చూపిస్తా అంటూ ఓ కామెంట్ చేసింది.

తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలుపెట్టగాడైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో అరియానా కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఎలిమినేషన్ రౌండ్ కూడా పూర్తయి ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేషన్ లిస్టులో చేరారు.

ఇక ఇందులో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ను ఇంటర్వ్యూ చేయనుంది అరియానా.

Telugu Anchor, Ariyana Glory, Bigg Boss, Rahul, Tanish, Tollywood-Movie

ఇప్పటికే పూర్తయిన 3, 4 సీజన్ లలో తనిష్, రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేయగా ఈ సీజన్ లో తొలిసారిగా ఫిమేల్ యాంకర్ అరియానా ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉంది.ఇదిలా ఉంటే ఈ విషయం గురించి తాను ఓ వీడియోను పంచుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.అందులో తనకు బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేయడం చాలా సంతోషమని.

ఇప్పటివరకు అబ్బాయిలే హోస్ట్ చేస్తూ వచ్చారని.ఈసారి తనపై నమ్మకం ఉంచి బిగ్ బాస్ యాజమాన్యం తనకు ఈ బాధ్యతను అప్పగించడంతో సంతోషంగా ఉందని తెలిపింది.

అబ్బాయిలే కాదు నేను కూడా చేసి చూపిస్తా అని తెలిపింది.ఇక చాలామంది బిగ్ బాస్ బజ్ తానే చేయాలని కోరుకున్నారు అంటూ మొత్తానికి ఆ కోరిక నెరవేరిందని అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ కోరుకుంది ఈ బోల్డ్ బ్యూటీ తన ఇంటర్వ్యూతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube