జబర్దస్త్‌కు ఒక యాంకర్‌ గుడ్‌ బై, కారణం అదే అయ్యి ఉంటుంది!  

తెలుగు ప్రేక్షకులను దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా ఉర్రూతలూగిస్తూనే ఉన్న కామెడీ షో జబర్దస్త్‌. ఈ కామెడీ షో మొదట అనసూయ యాంకర్‌గా ప్రారంభం అయ్యింది. అనసూయ గర్బవతి అవ్వడంతో ఆ స్థానంలో రష్మీ వచ్చింది. కామెడీ షోకు వస్తున్న ఆధరణ నేపథ్యంలో రెండు షోలుగా విడదీశారు. జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌. ఈ రెండు షోల్లో ఒక షోకు అనసూయ మరో షోకు రష్మీలు యాంకర్‌లుగా ప్రస్తుతం కనిపిస్తున్నారు. అయితే బుల్లి తెర వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అనసూయ మళ్లీ జబర్దస్త్‌ను వదిలేయబోతుందట.

Anchor Anasuya Says Good Bye To Jabardasth-Anchor Resmi Jabardasth Program

Anchor Anasuya Says Good Bye To Jabardasth

సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావడంతో పాటు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జబర్దస్త్‌ను అనసూయ వదిలేయాలనే నిర్ణయానికి వచ్చిందని, ఆమె స్థానంలో యాంకర్‌ వర్షిణిని ఈ షో కోసం ఎంపిక చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అనసూయ మూడు సినిమాల్లో నటించడంతో పాటు ఇంకా పలు ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. ఇలాంటి సమయంలో తప్పకుండా బుల్లి తెరను వదిలేయాలని అనసూయ నిర్ణయించుకుందట. అందుకే ఈమద్య జబర్దస్త్‌కు హాజరు కావడం లేదని తెలుస్తోంది.

Anchor Anasuya Says Good Bye To Jabardasth-Anchor Resmi Jabardasth Program

గత రెండు వారాలుగా ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ షోలు ఎప్పుడో నెల రోజుల క్రితం షూట్‌ చేశారట. మరో రెండు వారాల పాటు జబర్దస్త్‌లో అనసూయ కనిపించనుంది. ఆ తర్వాత అనసూయ స్థానంలో కొత్త అమ్మాయి లేదంటే వర్షిని లేదంటే రష్మీనే రెండు షోలకు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని, బంగారు బాతు వంటి జబర్దస్త్‌ను అనసూయ ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదు అంటూ ఆమె అభిమానులు అంటున్నారు. ఎన్ని సినిమాలు చేసినా కూడా జబర్దస్త్‌తో వచ్చిన క్రేజ్‌ ఆమెకు రాదని ఆమె అభిమానులు అంటున్నారు. మరి అనసూయ నిర్ణయం ఏంటీ అనేది కొన్ని రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.