కరోనా ఫైట్ కోసం విరాళాలు ఇవ్వమంటున్న తెలుగు యాంకర్....  

Anchor Anasuya Requesting For The Covid 19 Helping Funds - Telugu Anchor Anasuya, Anchor Anasuya Asking Helps To The Donatekart, Anchor Anasuya Bharadwaj, Anchor Anasuya Latest News, Anchor Anasuya Movie News, Anchor Anasuya Requesting For The Covid-19 Helping Funds

టాలీవుడ్ లో అందమైన యాంకర్ అనసూయ ఒక పక్క పలు రకాల షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే, మరో పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేటువంటి అనసూయ ఈ సారి కరోనా వైరస్ ఫైట్ విషయంపై స్పందించింది.

 Anchor Anasuya Requesting For The Covid 19 Helping Funds

ఇందులో భాగంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియోని పోస్ట్ చేసింది.

అయితే ఇందులో ప్రముఖ ఎన్జీవో సంస్థ అయినటువంటి డొనేట్ కార్ట్ సంస్థ గురించి మాట్లాడింది.

కరోనా ఫైట్ కోసం విరాళాలు ఇవ్వమంటున్న తెలుగు యాంకర్….-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోమ్స్ మరియు ఎవరకైతే ఈ కరోనా వైరస్ వల్ల నిరాశ్రయులై ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్లకి సహాయం చేస్తున్నటువంటి డొనేట్ కార్ట్ సంస్థకి తమకు తోచినంత విరాళం ఇవ్వాలని కోరారు.అంతేగాక తాము ఇచ్చినటువంటి విరాళాలను డొనేట్ కార్ట్ సంస్థ వెబ్సైట్లో ఉంచుతారని కూడా తెలిపింది.

అయితే అనసూయ చేసినటువంటి ఈ పనికి పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.అంతేగాక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది తిండి లేక పస్తులు ఉంటున్నారని అలాంటి వారికి సహాయం చేయడం అభినందించదగ్గ విషయమని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ కరోనా వైరస్ సహాయనిధిలకు బాగానే విరాళాలు అందిస్తున్నారు.ఇందులో మొదటగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ 20 లక్షల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి అందించగా, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 4 కోట్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 70 లక్షలు, టాలీవుడ్ యంగ్ టైగర్ 75 లక్షలు, ఇంకా పలువురు సినీ ప్రముఖులు తమకు తోచినంత నగదును విరాళాలాలుగా అందించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Anasuya Requesting For The Covid 19 Helping Funds Related Telugu News,Photos/Pics,Images..