సినిమాలు కారణంగా జబర్దస్త్ కి ఫుల్ స్టాప్ పెట్టనున్న అనసూయ  

Anchor Anasuya Quit Jabardasth Comedy Show-

జబర్దస్త్ కామెడీ రియాలిటీ షోతో టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ యాంకర్ అనసూయ.సాక్షి న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ తర్వాత జబర్దస్త్ షోతో ఒక్కసారిగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.

Anchor Anasuya Quit Jabardasth Comedy Show- Telugu Tollywood Movie Cinema Film Latest News Anchor Anasuya Quit Jabardasth Comedy Show--Anchor Anasuya Quit Jabardasth Comedy Show-

జబర్దస్త్ షోలో తన అందం గ్లామర్తో అందరికీ చేరువైన ఈ భామ ఊహించని విధంగా టాలీవుడ్ లో సినిమా అవకాశాలు సైతం సొంతం చేసుకుంది.క్షణం సినిమాతో టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన అనసూయ తన పెర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది.

ఇక రెండో ఛాన్స్ ఊహించని విధంగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో మెరిసి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా రంగమ్మత్త అయిపోయింది.

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ల రేంజ్ కి అనసూయ క్రేజ్ వెళ్ళిపోయింది.

అయితే ఈ భామ ని హీరోయిన్ గా కంటే సినిమాల్లో కీలకమైన పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ ఖాతాలో ఒక నాలుగైదు సినిమాలు వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో కథనం అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో అనసూయ కి అవకాశాలు పెరుగుతుండడంతో త్వరలో తనకి ఈ స్థాయి క్రేజీ ఇచ్చిన జబర్దస్త్ షోకి ఆమె ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.త్వరలో ఆమె ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో జబర్దస్త్ నిర్మాతలు కూడా అనసూయకి ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నట్లు టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం.

తాజా వార్తలు