అఖండలో కీలక పాత్రలో కనిపించనున్న హాట్ యాంకర్ అనసూయ

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ.భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బోయపాటి గత చిత్రాల శైలిలోనే ఈ మూవీ కూడా తెరకెక్కుతుంది.

 Anchor Anasuya Key Role In Akhanda Movie-TeluguStop.com

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

అలాగే బాలీవుడ్ నటుడు కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.అలాగే ప్రగ్యా జైస్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా పూర్ణ మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించనుంది.

 Anchor Anasuya Key Role In Akhanda Movie-అఖండలో కీలక పాత్రలో కనిపించనున్న హాట్ యాంకర్ అనసూయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Akhanda Movie, Anchor Anasuya, Boyapati Srinu, Nandamuri Balakrishna, Tollywood-Movie

ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో మరోసారి కనిపించబోతున్న సంగతి తెలిసిందే.బోయపాటి గతంలో ఈ మూవీలో రైతు పాత్రలో బాలకృష్ణని ఎలివేట్ చేయగా రీసెంట్ గా అఘోర పాత్రతో రౌద్రరాసాన్ని టీజర్ లో ప్రెజెంట్ చేసి సినిమా ఎలా ఉండబోతుంది అనేది హిట్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది.ఈ మూవీలో హాట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించాబోతుందని తెలుస్తుంది.

ఇక సినిమాలో ఆమె పాత్ర నిడివి ఓ 20 నిమిషాల పాటు ఉంటుందని వినికిడి.అలాగే సినిమాలో ఆమె ప్రాత్ర చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

అయితే అనసూయ నటించే విషయంపై బోయపాటి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

#Boyapati Srinu #Anchor Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు