బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా అనసూయకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.ఒకవైపు బుల్లితెరకు మరోవైపు వెండితెరకు సమన్యాయం చేస్తూ అనసూయ యాంకర్ గా సత్తా చాటుతున్నారు.
రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో ప్రతిభ ఉన్న నటిగా ప్రూవ్ చేసుకున్న అనసూయ తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రంగస్థలం తరువాత సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మొదట అనసూయ పాత్ర చిన్నపాత్రే అని వార్తలు వచ్చినా పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో అనసూయ పాత్ర పరిధి పెరిగిందని వార్తలు వస్తున్నాయి.అయితే తాజాగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను పుష్ప సినిమా షూటింగ్ లో నాలుగు రోజులు పాల్గొన్నానని అనసూయ చెప్పుకొచ్చారు.అల్లు అర్జున్ కు తాను ఫిదా అయ్యానని బన్నీకి పని విషయంలో అంకిత భావం, నిబద్ధత ఎక్కువని ఆమె తెలిపారు.ఫస్ట్ మూవీ కోసం ఏ విధంగా కష్టపడతారో పుష్ప మూవీ కోసం బన్నీ అదే విధంగా కష్టపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఫ్యాన్స్ అల్లు అర్జున్ పాత్రతో ఎగ్జైట్ అవుతారని అనసూయ తెలిపారు.
అయితే పుష్ప సినిమాలో తన పాత్ర గురించి మాత్రం అనసూయ వెల్లడించలేదు.తన పాత్ర ఈ సినిమాలో ఆశ్చర్యకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
పుష్ప మూవీలో అనసూయ పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.మరోవైపు బుల్లితెర షోలతో అనసూయ బిజీ అవుతున్నారు .టాలెంట్ పుష్కలంగా ఉన్న యాంకర్ కావడంతో ఈ యాంకర్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.