దాని వల్లే మొహంపై ఆ సమస్య.. అనసూయ కామెంట్స్ వైరల్..?

బుల్లితెర షో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర ఆఫర్ల కంటే వెండితెర ఆఫర్లపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాల కీలక పాత్రల్లో అనసూయ నటిస్తుండటం గమనార్హం.

 Anchor Anasuya Interesting Comments About Pimples-TeluguStop.com

సోషల్ మీడియాలో అనసూయ చేసే పోస్టులు, కామెంట్లు అప్పుడప్పుడూ వివాదాల్లో చిక్కుకున్నా అనసూయ సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు.

ఎవరైనా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేస్తే అనసూయ ఆ కామెంట్లకు ధీటుగా బదులిస్తారనే సంగతి తెలిసిందే.

 Anchor Anasuya Interesting Comments About Pimples-దాని వల్లే మొహంపై ఆ సమస్య.. అనసూయ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా అనసూయ ముఖంపై మొటిమలు రాగా అనసూయ ఆ మొటిమల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మేకప్ లేకుండా దిగిన ఫోటోను చూపిస్తూ తన ముఖంపై మొటిమలు రావడానికి గల కారణాలను అనసూయ వెల్లడించారు.

మేకప్ లేకుండా అనసూయ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు.

తన ముఖంపై నాలుగు మొటిమలు వచ్చాయని ఆ నాలుగు మొటిమల్లో ఒక మొటిమను గిచ్చేశానని అనసూయ వెల్లడించారు.అయితే మొటిమల విషయంలో ఆ విధంగా అస్సలు చేయకూడదని అనసూయ చెప్పుకొచ్చారు.అమ్మాయిలు మొటిమలు రావడం సమస్య అని ఫీలవుతూ ఉంటారని ఈ మధ్య అబ్బాయిలు కూడా మొటిమల విషయంలో ఫీలవుతున్నారని అనసూయ తెలిపారు.

అయితే మొటిమలు మన శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉందని చెప్పడానికి గుర్తు అని తనకు మామిడిపండ్లు తినడం వల్ల మొహంపై పింపుల్స్ వచ్చాయని అనసూయ అన్నారు.ఈ సీజన్ లో మాత్రమే మామిడిపండ్లు దొరుకుతాయని అందువల్ల వాటిని తినకుండా ఉండలేనని అనసూయ పేర్కొన్నారు.మిగతా సీజన్లలో సహజమైన మామిడిపండ్లు దొరకవని ఆమె చెప్పుకొచ్చారు.మామిడిపండ్లను ఇష్టపడేవాళ్లు అస్సలు మొహమాటపడవద్దని అనసూయ వెల్లడించారు.అనసూయ మొటిమల గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

#Four Pimples #Anchor Anasuya #Natural Mangoes #StarAnchor #Mangoes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు