పెళ్లి రోజున భర్తతో గొడవ పడ్డ అనసూయ.. అసలేమైందంటే..?

బుల్లితెర స్టార్ యాంకర్ గా అనసూయకు ప్రేక్షకుల్లో క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అందం, అభినయం పుష్కలంగా ఉన్న అనసూయ కొన్నిసార్లు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు.

 Anchor Anasuya Interesting Comments About Her Husband,latest News-TeluguStop.com

జూన్ 5వ తేదీ అనసూయ పెళ్లిరోజు కాగా మ్యారేజ్ డే సందర్భంగా అనసూయ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.

Telugu Anchor Anasuya, Day-Movie

అనసూయ, సుశాంక్ భరద్వాజ్ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.తమ పెళ్లి బంధానికి 11 సంవత్సరాలు, క్రేజీ ప్రేమకు 20 సంవత్సరాలు నిండాయని అనసూయ అన్నారు.భర్త భరద్వాజ్ గురించి చెబుతూ తాము గొడవ పడతామని, ఒకరిని మరొకరు బాధ పెట్టుకోవడంతో పాటు వ్యతిరేకించుకుంటామని ఇడియాటిక్ విషయాలకు సంబంధించి తాము ఒట్లు వేసుకుంటామని అనసూయ చెప్పుకొచ్చారు.

తమ మధ్య బంధం తరువాత రోజునుంచి ఉండదేమో అనే విధంగా తమ మధ్య కొన్నిసార్లు గొడవలు జరుగుతాయని అనసూయ చెప్పుకొచ్చారు.అయితే గొడవల కంటే తమ మధ్య ప్రేమ, అభిమానం ఉందని తన భర్త తప్ప తనకు మరో విషయం తెలియదని ఐలవ్యూ అంటూ అనసూయ భర్తపై ప్రేమను చాటుకున్నారు.

ఒకరిపై మరొకరు చెప్పలేని స్థాయిలో ఇష్టాన్ని వ్యక్తీకరించుకుంటామని అనసూయ అన్నారు.

Telugu Anchor Anasuya, Day-Movie

భర్తతో కలిసి దిగిన ఫోటోను ఎందుకు పెట్టడం లేదంటే తమ మధ్య గొడవ జరిగిందని అనసూయ అన్నారు.ప్రస్తుతం రంగమార్తాండ, ఖిలాడీ సినిమాలతో పాటు పలు సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు.ప్రస్తుతం అనసూయ నటిస్తున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కావడం గమనార్హం.

స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న అనసూయ ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే మరో రెండు మూడేళ్లు బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube