అనసూయ తొలి సంపాదన ఎంతో తెలుసా..?

గడిచిన కొన్ని సంవత్సరాల్లో యాంకర్లు తమ రెమ్యునరేషన్లను భారీగా పెంచేశారు.ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ సంపాదించుకున్న సుమ, అనసూయలకు షోలు, ఈవెంట్ల కోసం భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

 Anchor Anasuya First Remuneration Details , Anchor Anasuya,jabardast Anchor, An-TeluguStop.com

అయితే యాంకర్ అనసూయ తొలి సంపాదన తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే.అనసూయ తొలి సంపాదన కేవలం 5,000 రూపాయలు కావడం గమనార్హం.

మొదట్లో అనసూయ బ్యాంక్ లో టెలీకాలర్ గా పని చేశారు.

ఆ సమయంలో అనసూయ నెలకు 5,000 రూపాయలు సంపాదించగా తరువాత కాలంలో ఆమె హెచ్.

ఆర్ గా పని చేశారు.కొన్ని కారణాల వల్ల హెచ్.

ఆర్ ఉద్యోగం మానేసిన అనసూయ ఆ తర్వాత సాక్షి ఛానెల్ లో న్యూస్ యాంకర్ గా చేశారు.అప్పటికే కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్న అనసూయకు యాంకర్ గా చేసిన తరువాత జబర్దస్త్ షోలో అవకాశం వచ్చింది.

మధ్యలో అనసూయ కొంతకాలం జబర్దస్త్ షోకు దూరమైనా మళ్లీ ఆ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు.

Telugu Rupees, Anasuya, Anasuyasusank, Anasuya Offers, Anausya Salary, Anchor An

తన లవ్ స్టోరీ గురించి అనసూయ చెబుతూ అందులో ప్రేక్షకులకు కావాల్సిన మసాలా ఉందని ఆమె పేర్కొన్నారు.ఇంటర్ చదువుతున్న సమయంలో ఎన్.సీ.సీ పరేడ్ కోసం ఢిల్లీకి వెళ్లానని అక్కడే తనకు సుశాంక భరద్వాజ్ తో పరిచయం ఏర్పడిందని ఆమె అన్నారు.పరిచయమైన కొన్ని రోజులకే సుశాంక్ తనను ఇష్టపడుతున్నానని చెప్పారని ఇంట్లో ప్రేమ విషయం తెలిసిన తర్వాత గొడవైందని అనసూయ తెలిపారు.
దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రేమ పోరాటం చేసి పెళ్లి చేసుకున్నామని అనసూయ తన ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు.అనసూయ పూర్తి శాకాహారి కావడం గమనార్హం.

యోగా, వర్కౌట్ల వల్లే అందంగా, ఫిట్ గా కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.ఎప్పుడైనా ఎక్కువగా బాధ అనిపిస్తే వైన్ తాగి ఆ బాధను భర్తతో పంచుకుని నిద్రపోతానని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube