యాంకర్ అనసూయ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుస్తే షాక్ అవుతారు.!       2018-06-26   00:21:40  IST  Raghu V

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ కి గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతున్న యాంకర్ అనసూయ. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకెళుతున్న అనసూయ అటు వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది.సుకుమార్ ,రాంచరణ్ కాంభినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమలో రంగమ్మ అత్తగా నటించి ఆడియన్స్ తో శబాష్ అనిపించుకుంది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే పూర్తిస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తున్న అనసూయ నెలవారి ఇన్ కం గురించి మాట్లాడుకుందామా..

అప్పుడెప్పుడో బద్రుకా కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజ్ లో జూ.ఎన్టీయార్ నాగ సినిమా షూటింగ్ జరిగితే చూడ్డానికి వెళ్లిందట అనసూయ..అందులో కొంతమంది స్టూడెంట్స్ కనిపించాలి 500 రూపాయలు ఇస్తామంటే సరదాగా ఉంటుందని ఫ్రెండ్స్ తో కలిసి షూటింగ్ చూడ్డానికి వెళ్లి తను అందుకున్న మొదటి పారితోషికం 500.అప్పటికి తనకు తెలీదు భవిష్యత్లో సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత చదువు అయిపోవడం,జాబ్ జాయిన్ అవ్వడం జరిగాయి..తను జాబ్ చేసే చోటుకి ఎక్కువగా సినిమాకు సంభందించిన వారు రావడం..అనసూయ పొడుగరి,మాటకారి కావడంతో సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారట..వారి సలహాని ఫాలో అవుతూ మొదట ఒక న్యూస్ ఛానెల్లో జాయిన్ అయిన అనసూయ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకి పూర్తిస్థాయి యాంకర్ గా మారింది.

ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమ బాద్యతలను రష్మికి అప్పచెప్పి సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంది..ఎంతగా ట్రై చేసినా చిన్నా చితకా పాత్రలు తప్పితే సరైన పాత్ర దక్కకపోవడంతో తిరిగి ఎక్స్ట్రా జబర్దస్త్,జబర్దస్త్ అంటూ రష్మి,అనసూయ ఇద్దరూ జబర్దస్త్ ని ఏలుతున్నారు..పోయినేడాది అనసూయ ఖాతాలో మంచి సినిమాలే పడ్డాయని చెప్పాలి..అడవి శేష్ క్షణం,నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో అనసూయ సినిమా కెరీర్ కొంచెం గాడిలో పడింది..పనిలో పనిగా స్పెషల్ సాంగ్స్ కూడా ఒప్పుకుంటుంది..

రంగస్థలం రంగమ్మత్త పాత్రతో ఇక అనసూయ సినిమా కెరీర్ కి ఢోకా ఉండదనే మాట వినిపిస్తుంది..కెరిరో మొదట్లో ఒక ప్రోగ్రామ్ కి యాభై వేలు తీసుకునే అనసూయ ఇప్పుడు అమాంతం దానిని మూడు రెట్లు పెంచేసింది..వివిధ ఛానెల్లలో ప్రోగ్రామ్లకు యాంకరింగ్,ఆడియో ఫంక్షన్లు,స్పెషల్ సాంగ్స్,సినిమాల్లో పాత్రల ద్వారా చేతినిండా సంపాదిస్తుందనే చెప్పొచ్చు..ఎంతైనా సినిమా వాళ్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి..ఈ సామెతను అనసూయ చక్కగా ఫాలో అవుతుంది.