యాంకర్ అనసూయ అస్సలు తగ్గడం లేదుగా.. ఆ షోలో కూడా పిచ్చపిచ్చగా డ్యాన్స్!

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.తన అందాలతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 Anchor Anasuya Crazy Dancing Performance In That Show Anchor Anasuya, Tollywood,-TeluguStop.com

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ప్రస్తుతం వెండితెరపై వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ.అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.

కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Telugu Anchor Anasuya, Dance Permance, Telugu, Tollywood-Movie

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అనసూయ.దాంతో ఆ తర్వాత ఈ అమ్మడు కు వెండితెరపై వరుస అవకాశాలు వచ్చాయి.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగటివ్ రోల్ తో బాగా ఆకట్టుకుంది.ఇక పుష్ప 2 లో కూడా అనసూయ పాత్ర కి మరింత క్రేజ్ ఉంటుందని తెలిసింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

నిత్యం హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక తాజాగా ఓ షోలో పిచ్చపిచ్చగా డాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోయింది.తాజాగా సూప‌ర్ సింగ‌ర్ జూనియ‌ర్ షోలో సూడిగాలి సుధీర్ తో క‌లిసి అనసూయ కూడా యాంక‌రింగ్ చేస్తోంది.

అందులో ఇద్దరు చిన్న పిల్లలతో క‌లిసి బుల్లెట్టు సాంగ్ కి హాట్ హాట్ స్టెప్పులతో బాగా పిచ్చెక్కించింది.ఇక దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.

అనసూయ అస్సలు తగ్గడం లేదు గా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube