సారీ చెప్పినా క్షమించని అనసూయ.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేస్తున్న పోస్టులు, ఫోటోలు, వీడియోలపై కొందరు నెటిజన్లు సెలబ్రిటీలు హర్ట్ అయ్యేలా కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే చాలామంది సెలబ్రిటీలు ఈ కామెంట్ల విషయంలో రియాక్ట్ కావడానికి ఆసక్తి చూపరు.

 Anchor Anasuya Counter To Netizen In Social Media, Anchor Anasuya, Counter To Ne-TeluguStop.com

అయితే స్టార్ యాంకర్ అనసూయ మాత్రం నెటిజన్ కు దిమ్మతిరిగే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు.నెటిజన్ క్షమించమని కోరినా అనసూయ మాత్రం మరింత ఘాటుగా స్పందించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే యాంకర్ అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో లంగావోణీలో దిగిన ఫోటోను షేర్ చేశారు.అనసూయ షేర్ చేసిన ఆ ఫోటోకు భారీగా లైకులు వచ్చాయి.

చాలామంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తే ఒక నెటిజన్ మాత్రం మీమ్ తయారు చేసి నువ్వేమైనా సమంత అనుకుంటున్నావా.? అంటూ మీమ్ ను అనసూయ హర్ట్ అయ్యేలా క్రియేట్ చేశారు.అయితే ఆ మీమ్ చూసిన అనసూయ అయ్యో లేదు.తనను అందరూ అనసూయ అని పిలుస్తారని కౌంటర్ ఇచ్చారు.

Telugu Anchor Anasuya, Counter Netizen, Jabardasth-Movie

అనసూయ నుంచి రిప్లై రావడంతో సదరు నెటిజన్ తాను సరదాగా అలా పేర్కొన్నానని.తనను క్షమించాలని కోరారు.అయితే అనసూయ మాత్రం నువ్వింకా చిన్న పిల్లవాడివే అని నాకు అర్థమైంది అని.నువ్వు త్వరలోనే ఎదగాలని తాను కోరుకుంటున్నని చెబుతూ నెటిజన్ కు దిమ్మతిరిగేలా జవాబు చెప్పారు. అనసూయ మీమ్ విషయంలో స్పందించిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మరి కొందరు నెటిజన్లు మాత్రం అనసూయ అలాంటి కామెంట్లకు స్పందించి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు.

సారీ చెప్పినా అనసూయ నెటిజన్ ను క్షమించకుండా అతనికి బుద్ధి వచ్చే విధంగా సమాధానం చెప్పడం గమనార్హం.మరోవైపు అనసూయ ఖిలాడీ, రంగమార్తాండ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube