అనసూయకు హీరో నాగార్జున ఆడి కారు గిఫ్ట్ ఇచ్చాడా.. క్లారిటీ ఇచ్చిన యాంకర్!

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.తన అందాలతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 Anchor Anasuya Condemns Rumors On Nagarjuna Gifted Audi Car, Anchor Anasuya, Nag-TeluguStop.com

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ప్రస్తుతం వెండితెరపై వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ.అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.

కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

నిత్యం హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.ఇక అనసూయ శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకోగా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

అయినా కూడా తన అందం లో ఎటువంటి మార్పు లేదు.లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తుంది.

ఇక సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక ఈమెకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.అంతేకాకుండా తన నోటికి వచ్చిన మాటలతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.

Telugu Anasuya, Anchor Anasuya, Audi Car, Jabardasth, Nagarjuna, Pushpa, Tollywo

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదిక ఇన్ స్టా లో తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.తనపై వచ్చిన పుకార్ల గురించి అడగండని నెటిజన్లను కోరింది.ఇక ప్రతి ఒక్కరు గతంలో తనపై వచ్చిన పుకార్ల గురించి ప్రశ్నలు వేశారు.వాటికి తాను ఓపెన్ గా సమాధానం చెప్పింది.అంతేకాకుండా తనకు నాగార్జున ఆడి కార్ గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చింది.అందులో ఓ నెటిజన్.

మీకు నాగార్జున ఆడి కార్ గిఫ్ట్ ఇచ్చాడు అంట కదా అని అడగటంతో.వెంటనే అనసూయ ఆశ్చర్యపోతూ.

నిజమా.అలా అయితే నాకు ఈఎంఐ టెన్షన్స్ ఎందుకు.

ఆ ట్రోలింగ్స్ ఎందుకు అంటూ.లేదు! నేను మా ఆయన కష్టార్జితం అన్ని.

అంటూ సమాధానం ఇచ్చింది.

Telugu Anasuya, Anchor Anasuya, Audi Car, Jabardasth, Nagarjuna, Pushpa, Tollywo

గతంలో తనకు నాగార్జున కారు ఇప్పించిన పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టింది అనసూయ.ఇక ఈ ముద్దుగుమ్మ గత ఏడాది విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగటివ్ పాత్రతో బాగా అదరగొట్టిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నెగటివ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

ఇవే కాకుండా పలు ప్రాజెక్టులలో కూడా అవకాశాలు అందుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube