ఆ డైరెక్టర్‌తో అన్ని విషయాలు పంచుకుంటా.. అనసూయ కామెంట్స్ వైరల్..?

బుల్లితెర యాంకర్లలో ఒకరైన అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమాలో నటించగా ఆ సినిమా నేడు విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం గమనార్హం.

 Anchor Anasuya Comments About Buchibabu Sana-TeluguStop.com

అయితే తాజాగా అనసూయ థ్యాంక్యూ బ్రదర్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఎన్నో ముఖ్య విషయాలను వెల్లడించారు.కొన్ని రోజుల క్రితం అనసూయ ఉప్పెన మూవీ సెట్ లో కనిపించారు.

అయితే ఉప్పెన సినిమాలో మాత్రం అనసూయ అస్సలు కనిపించలేదనే సంగతి తెలిసిందే.ఉప్పెన మూవీ సెట్ కు వెళ్లడం గురించి అనసూయ మాట్లాడుతూ తాను రంగస్థలం సినిమాలో నటించడంతో బుచ్చిబాబు సానాతో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

 Anchor Anasuya Comments About Buchibabu Sana-ఆ డైరెక్టర్‌తో అన్ని విషయాలు పంచుకుంటా.. అనసూయ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబు సానా, మరికొందరు తనను రంగమ్మత్త అని పిలిచేవారని చరణ్ మాత్రం తన పేరు పెట్టి పిలిచేవారని అనసూయ వెల్లడించారు.

బుచ్చిబాబుతో తాను పర్సనల్ విషయాలను పంచుకుంటానని అనసూయ పేర్కొన్నారు.ఒకసారి తన ఇంటికి దగ్గరలోనే ఉప్పెన మూవీ షూటింగ్ జరుగుతోందని ఆ సమయంలో బుచ్చిబాబు ఫోన్ చేసి ఉప్పెన షూటింగ్ లో విజయ్ సేతుపతి ఉన్నారని చెప్పడంతో అక్కడికి వెళ్లానని తెలిపారు.విజయ్ సేతుపతికి ఫ్యాన్ అయిన అనసూయ ఆయనను చూడటానికి ఉప్పెన మూవీ సెట్ కు వెళ్లానని చెప్పారు.

పిజ్జా, 96 సినిమాలతో తాను విజయ్ సేతుపతికి ఫ్యాన్ అయ్యానని అనసూయ అన్నారు.

తాను విజయ్ సేతుపతితో కలిసి వర్క్ చేసే రోజు రావాలని భావిస్తున్నానని అనసూయ చెప్పుకొచ్చారు.

ఉప్పెన షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయంతో చెన్నైకు వెళ్లిన సమయంలో కూడా విజయ్ సేతుపతిని కలిశానని ఆమె తెలిపారు.అనసూయ సినిమాలతో బిజీగా ఉంటూనే బుల్లితెరకు కూడా ప్రాధాన్యతనిస్తుండటం గమనార్హం.

#Uppena #Anasuya #Buchi Babu Sana #AnchorAnasuya #Buchibabu Sana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు