కోట కామెంట్లపై ఫైర్ అయిన అనసూయ.. నీచంగా మాట్లాడారంటూ?

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.జబర్దస్త్ షోకు చాలా సంవత్సరాలుగా అనసూయ యాంకర్ గా కొనసాగుతున్నా ఆమెకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.

 Anchor Anasuya Bharadwaj Fire On Kota Sreenivasarao Why Because , Anasuya Bharad-TeluguStop.com

అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండటంతో పాజిటివ్ కామెంట్లపై, నెగిటివ్ కామెంట్లపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతుంటారనే విషయం తెలిసిందే.

జబర్దస్త్ షో ద్వారా అనసూయకు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

రంగస్థలం సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు అనసూయకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.అయితే తాజాగా కోట శ్రీనివాసరావు అనసూయ వేసుకునే బట్టలు నచ్చవని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

అనసూయ డ్రెస్సింగ్ మారిస్తే బాగుంటుందని కోట శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే కోట శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుండా ఆయన కామెంట్ల గురించి అనసూయ ఘాటుగా స్పందించారు.

ఒక సీనియర్ నటుడు తనపై కొన్ని కామెంట్లు చేశాడని అనుభవం ఉన్న ఆ నటుడు తన వస్త్రధారణ గురించి నీచంగా మాట్లాడాడని అనసూయ చెప్పుకొచ్చారు.ఎలాంటి దుస్తులు ధరించాలనేది వాళ్ల వ్యక్తిగతమని వృత్తిని బట్టి కూడా కొన్నిసార్లు దుస్తులను ధరించాల్సి ఉంటుందని అనసూయ కామెంట్లు చేశారు.అయితే సోషల్ మీడియా ఇలాంటి విషయాలను హైలెట్ చేస్తుందని అనసూయ చెప్పుకొచ్చారు.ఆ సీనియర్ నటుడు మహిళలను కించపరిచిన సమయంలో, అధ్వాన్నమైన దుస్తులను ధరించిన సమయంలో సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.

ఒక వ్యక్తిగా ఆయన చేసిన కామెంట్లు నీచంగా ఉన్నాయని అనసూయ చెప్పుకొచ్చారు.ప్రజలకు అభిప్రాయాలను చెప్పే సమయంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే బాగుంటుందని అనసూయ అభిప్రాయపడ్డారు.పెళ్లి చేసుకుని పిల్లల్ని కలిగి ఉండి హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ చొక్కాలు విప్పి దేహాన్ని చూపించే హీరోలను ఎందుకు ప్రశ్నించరని అనసూయ కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube