మరోసారి తల్లిని కావాలనుకుంటున్నా.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు!  

జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఏ విషయం గురించైనా తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతుందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఒకవైపు జబర్దస్త్ షో షూటింగ్ తో బిజీగా ఉన్న అనసూయ మరోవైపు థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

TeluguStop.com - Anchor Anasuya Bharadwaj Comments On Her Third Pregnancy

ఈ సినిమాలో అనసూయ గర్భవతి పాత్రను పోషిస్తున్నారు.ఇద్దరు పిల్లల తల్లైన అనసూయ ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే రెండుసార్లు తల్లైన అనసూయ తాను మరోసారి తల్లిని కావాలని అనుకుంటున్నానని తన మనస్సులోని మాటను వెల్లడించారు.గర్భవతిగా ఉన్న సమయంలో భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని.

TeluguStop.com - మరోసారి తల్లిని కావాలనుకుంటున్నా.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మాతృత్వంలో ఉన్న ఆనందం అంతాఇంతా కాదని అనసూయ అన్నారు.ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ మూడో బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నానని చేసిన క్రేజీ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మరి మనస్సులోని కోరికను బయటపెట్టిన అనసూయ నిజంగానే తల్లై ఆ కోరికను నెరవేర్చుకుంటుందేమో చూడాల్సి ఉంది.మరోవైపు అనసూయ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెండితెరపై కూడా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.వచ్చిన ప్రతి ఆఫర్ కు యస్ చెప్పకుండా పేరు, గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను మాత్రమే అనసూయ ఎంచుకుంటున్నారు. థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
నిజానికి చాలామంది ఇద్దరు పిల్లలు చాలని అనుకుంటూ ఉంటారు.అయితే అనసూయ మాత్రం మూడో బిడ్డ కూడా కావాలని చెబుతుండటం గమనార్హం.

అయితే కొందరు నెటిజన్లు సినిమాపై అంచనాలు పెంచడానికి అనసూయ ఆ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.బుల్లితెరపై గ్లామరస్ గా కనిపించే అనసూయ వెండితెరపై మాత్రం అభినయానికే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

#Anchor Anasuya #@anusuyakhasba #AnchorAnasuya #ThankYou #ThankyouBrother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Anasuya Bharadwaj Comments On Her Third Pregnancy Related Telugu News,Photos/Pics,Images..