ఏంది అనసూయ… ఆ పార్టీలో ఫుల్లుగా తాగి రచ్చ చేసావంటగా…  

Anchor Anasuya Anasuya Bharadwaj Tollywood Netizens Drinker In Party Strong Warning - Telugu In Party, Anasuya Bharadwaj, Anchor Anasuya, Drinker, Netizens, Strong Warning, Tollywood

టాలీవుడ్ లో పాపులారిటీ కలిగినటువంటి యాంకర్లలో హాట్ యాంకర్ అనసూయ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.ఈమె ఛానల్ తో సంబంధం లేకుండా తెలుగులోని దాదాపు అన్ని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ లో తన హవాను కొనసాగిస్తోంది.

 Anchor Anasuya Anasuya Bharadwaj Tollywood Netizens Drinker Alcohol In Party Strong Warning

ఒకపక్క పలురకాల షోలు, ఈవెంట్లు నిర్వహిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా బాగానే రాణిస్తోంది.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది.

అయితే ఇటీవలే ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీరు మరియు టాలీవుడ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ దర్శకుడు కలిసి ఫుల్లుగా మద్యం సేవించి రచ్చ రచ్చ చేసారంట కదా అంటూ కామెంట్ చేశాడు.దీంతో యాంకర్ అనసూయ ఆ నెటిజన్ పై ఫైర్ అయ్యింది.

ఏంది అనసూయ… ఆ పార్టీలో ఫుల్లుగా తాగి రచ్చ చేసావంటగా…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక తన దైన శైలిలో స్పందిస్తూ నువ్వు ఇంకా పరిణితి చెందినట్లు లేవు, ఒకవేళ నువ్వు పరిణితి చెంది ఉంటే నీకు అసలు నిజం ఏంటో తెలుస్తుంది అంటూ సమాధానం ఇచ్చింది.అయితే ఇలాంటి కామెంట్లు ఎదుర్కోవడం యాంకర్ అనసూయకి కొత్తేమీ కాదు.

గతంలో కూడా కొంతమంది ఆకతాయిలు అనసూయ గురించి అసభ్య పదజాలంతో కామెంట్లు, ట్రోల్స్ చేయడంతో ఆమె ఏకంగా ఇంకోసారి ఇలాంటివి పునరావృతం అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ అనసూయ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో ఓ ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఆ యాంకర్ అనసూయ తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నటువంటి “పుష్ప” అనే చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Anasuya Strong Warning To The Netizen Related Telugu News,Photos/Pics,Images..