తరుణ్‌ భాస్కర్‌తో రొమాన్స్‌పై కుండబద్దలు కొట్టిన అనసూయ

హాట్‌ యాంకర్‌ అనసూయ జబర్దస్త్‌ అందాలను బుల్లి తెర ప్రేక్షకులతో పాటు అప్పుడప్పుడు వెండి తెర ప్రేక్షకులకు కూడా చూపిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.బుల్లి తెరపై సంచలన తారగా పేరు తెచ్చుకున్న అనసూయ వెండి తెరపై కూడా మెల్ల మెల్లగా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

 Anchor Anasuya About Romance With Tarun Bhaskar-TeluguStop.com

ఈ అమ్మడు రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.అంతకు ముందు క్షణం చిత్రంలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి అలరించింది.

తాజాగా ఈమె దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హీరోగా నటించబోతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న తరుణ్‌ భాస్కర్‌ హీరోగా ఒక చిత్రం రూపొందబోతుంది.ఆ చిత్రంను విజయ్‌ దేవరకొండ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.విజయ్‌ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌లో ఎంటర్‌ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇలాంటి క్రేజీ మూవీలో అనసూయ ఒక కీలక పాత్ర పోషిస్తుందని, తరుణ్‌ భాస్కర్‌తో ఈమె రొమాన్స్‌ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని, మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.తాజాగా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

మీడియాలో వస్తున్నట్లుగా తాను తరుణ్‌ భాస్కర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం నిజమే అని, అయితే ఆ సినిమాలో తాను తరుణ్‌తో రొమాన్స్‌ చేయడం కాని, హాట్‌గా కనిపించడం కాని ఉండదని చెప్పుకొచ్చింది.ఆ సినిమా గురించి ప్రస్తుతానికి ఇంతే మాట్లాడగలను.త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతుంది.అప్పుడు సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతారు.అప్పుడు నా పాత్ర గురించి కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పుకొచ్చింది.ఒక్కటి మాత్రం నిజం తన పాత్ర సినిమాకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ అనసూయ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube