పవన్ సినిమా కోసం తెరపైకి వచ్చిన అనసూయ పేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు జనసేన పార్టీ రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే మరో వైపు వరుసగా సినిమాలు లైన్ లో పెట్టాడు.ఇప్పుడు ఐదు సినిమాల వరకు పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యి ఉన్నాడు.

 Anasuya's Huge Break With Pawan Kalyan, Tollywood, Telugu Cinema, South Cinema,-TeluguStop.com

ఇందులో వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లాక్ డౌన్ తర్వాత మరల స్టార్ట్ అయ్యింది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ ఒకటి, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాని లైన్ లో పెట్టాడు.

అయితే ఈ రెండింటిలో దీనిని ముందుగా సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా నటిస్తాడనే మాట బలంగా వినిపిస్తుంది.అలాగే ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే, రష్మిక మందన పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అలాగే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం యాంకర్ అనసూయని ఫైనల్ చేసినట్లు చర్చ నడుస్తుంది.ఇప్పటికే అనసూయ వరుస అవకాశాలతో మంచి జోరు మీద ఉంది.

మెగా ఫామిలీలోనే చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుంది.అలాగే పుష్ప సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరీష్ కలయికలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సిస్టర్ పాత్రలో అనసూయ కనిపించబోతుంది అనే మాట బలంగా వినిపిస్తుంది.ఇదే నిజమైతే వరుసగా మెగా హీరోల సినిమాలలో అవకాశాలు పట్టేస్తున్న అందాల భామగా అనసూయ పేరు మార్మోగిపోతోంది.

అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube