మరోసారి అలాంటి పాత్రలో అనసూయ..?

టాలీవుడ్‌లో బుల్లితెర యాంకర్ నుండి సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు చేసే నటిగా ఎదిగిన హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్, వెండితెరపై కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఈ బ్యూటీ సక్సె్స్ అయ్యింది.

 Anasuya To Play Negative Role Again, Anasuya, Negative Role, Rangasthalam, Ranga-TeluguStop.com

ఇక వెండితెరపై అమ్మడికి పేరు తెచ్చిన పాత్రలు క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో దక్కాయి.కాగా ఇప్పుడు మరో సినిమాలోనూ ఇలాంటి గుర్తింపునే దక్కించుకునేందుకు అనసూయ రెడీ అవుతోంది.

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ‘రంగమార్తాండ’లో అనసూయ ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అనసూయ ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ అనుకున్నారు.

కాగా ఈ సినిమాలో పూర్తి స్థాయి నెగెటివ్ రోల్‌లో నటించేందుకు అనసూయను కృష్ణవంశీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.గతంలో నెగెటివ్ రోల్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఫుల్ లెంగ్త్‌లో నెగెటివ్ రోల్‌లో నటిస్తుండటంతో ఆమె ఈ సినిమాలో ఎలా నటిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడటంతో అనసూయ తనకు తానే సాటి అనిపించుకుంది.మరి అనసూయ కోసం కృష్ణవంశీ ఎలాంటి నెగెటివ్ రోల్‌ను క్రియేట్ చేశాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఏదేమైనా ప్రస్తుతం అనసూయ చేయబోయే ఈ నెగెటివ్ పాత్ర ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని క్రియేట్ చేసిందనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube