రంగమ్మత్త స్పెషల్ అంటోన్న ఆచార్య

టాలీవుడ్‌లో బుల్లితెరపై తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తరువాత వెండితెరపై తమ అదృష్టాన్ని చాలా మంది పరీక్షించుకున్నారు.వీరిలో కొంతమంది వెండితెరపై కూడా తమ సత్తా చాటారు.

 Anasuya To Do Special Song In Acharya Movie-TeluguStop.com

అయితే కొందరు మాత్రం తమ క్రేజ్‌తో వెండితెరపై కూడా వెలిగిపోతుంటారు.ఈ కోవలోకే చెందింది బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ.

బుల్లితెరపై తన హాట్ అందాలతో పిచ్చెక్కించిన ఈ బ్యూటీ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో చేసిన రంగస్థలం పాత్ర ఆమెకు అదిరిపోయే గుర్తింపును తెచ్చిపెట్టింది.ఈ పాత్రతో ఆమెకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి.

ఇక ఇప్పుడు ఇదే క్రేజ్ ఆమెకు మరో భారీ సినిమాలో ఆఫర్ తెచ్చిపెట్టిందట.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో అనసూయతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

అయితే ఇప్పటికే ఈ సినిమాలో అందాల భామ రెజీనాతో ఓ ఐటెం సాంగ్‌ను షూట్ చేశారు చిత్ర యూనిట్.మరి అనసూయతో ఎలాంటి పాట చేయిస్తారా అనే సందేహం చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube