రౌడీ కోసం అనసూయ అలా మారుతుందా..?  

Anasuya To Do Negative Role In Vijay Devarakonda Movie - Telugu Anasuya, Telugu Movie News, Vijay Devarakonda, World Famous Lover

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్‌ ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ కొట్టాలని చూసిన విజయ్ దేవరకొండ ఆశలపై ప్రేక్షకులు నీళ్లు జల్లారు.

Anasuya To Do Negative Role In Vijay Devarakonda Movie - Telugu Anasuya, Telugu Movie News, Vijay Devarakonda, World Famous Lover-Gossips-Telugu Tollywood Photo Image

సినిమాలో సత్తా లేకపోవడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు.

ఈ సినిమా తరువాత విజయ్ తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

కాగా విజయ్ నిర్మాతగా మారి చేసిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది.

ఇక తన బ్యానర్‌పై రెండో సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ ఓ నెగెటివ్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఆమెను విజయ్ సంప్రదించగా ఆమె వెంటనే ఓకే కూడా చెప్పిందట.గతంలో ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీలోనూ అనసూయ నటించింది.ఇప్పుడు విజయ్ నిర్మిస్తున్న రెండో సినిమాలోనూ అనసూయ నటిస్తుండటంతో ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు