రంగస్థలం దెబ్బకు ఆమెను వదలనంటున్న సుక్కు  

Anasuya To Do Key Role In Allu Arjun Sukumar Movie-ram Charan,rangasthalam,sukumar,telugu Movie News

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్‌కు ఫిదా కాని జనం లేరు.

Anasuya To Do Key Role In Allu Arjun Sukumar Movie-ram Charan,rangasthalam,sukumar,telugu Movie News-Telugu Gossips Anasuya To Do Key Role In Allu Arjun Sukumar Movie-ram Charan Rangasthalam Sukumar T-Anasuya To Do Key Role In Allu Arjun Sukumar Movie-Ram Charan Rangasthalam Sukumar Telugu Movie News

ఈ సినిమాతో టాలీవుడ్ రికార్డులను చరణ్ తిరగరాశారు.అయితే ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన హాట్ యాంకర్ అనసూయ పర్ఫార్మెన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో అనసూయ చేసిన నటనకు సుకుమార్ చాలా ఇంప్రెస్ అయ్యారు.

దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో అనసూయ కోసం ఓ ప్రత్యేక పాత్రను క్రియేట్ చేశారట సుకుమార్.ఈ పాత్ర ఆమెకు మరింత పేరు తీసుకొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా బన్నీ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

మరి రంగస్థలం తెచ్చిపెట్టిన పేరును అనసూయ సుకుమార్-బన్నీ సినిమాలో ఎలాంటి పాత్రతో మెప్పిస్తుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

.

తాజా వార్తలు