మల్లూ బ్యూటీగా మారుతున్న అనసూయ  

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.బుల్లితెరపై హాట్ అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ, వెండితెరపై తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.

TeluguStop.com - Anasuya To Debut In Malayalam Movies

ఆమె నటించిన రంగస్థలం, క్షణం వంటి చిత్రాలు ఆమె నటనకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో మనకు చెబుతాయి.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు అనసూయ రెడీ అయ్యింది.

TeluguStop.com - మల్లూ బ్యూటీగా మారుతున్న అనసూయ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఇప్పుడు మరో ఇండస్ట్రీలో తన సత్తా చాటేందుకు అనసూయ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో అనసూయ నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు అనసూయ సైన్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి అనసూయ పేరును రికమెండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో మమ్ముట్టితో కలిసి ‘యాత్ర’ సినిమాలో అనసూయ నటించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో ఆమె యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన మమ్ముట్టి, ఇప్పుడు మలయాళ సినిమాలో ఆఫర్ వచ్చేలా చేసినట్లు మాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఏదేమైనా తెలుగుతో పాటు ఇప్పుడు తమిళం, మలయాళం లాంటి ఇతర భాషల్లో కూడా తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు అనసూయ రెడీ అయ్యిందని, ఆమె అక్కడ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి మలయాళంలో అమ్మడికి ఎలాంటి పాత్ర లభించిందో తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Anasuya #Jabardasth #Vijay Sethupati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు