అనసూయ నువ్వు గ్రేట్‌.. ఆహా అనిపించారు మేడం

అనసూయను ఇప్పటి వరకు జబర్దస్త్ యాంకర్‌ గా హాట్‌ బ్యూటీగానే అందరికి తెలుసు.రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించి మెప్పించింది.

 Anasuya Thank You Brother Movie Now Streaming In Aha Ott-TeluguStop.com

అందరి అంచనాలకు అందుకునేలా అనసూయ అన్ని పాత్రల్లో కూడా చక్కటి నటన కనబర్చగలదు అంటూ రంగమ్మత్త పాత్రతో క్లారిటీ వచ్చింది.ఇప్పుడు అనసూయ మరో సారి తన సత్తా చాటింది.

థ్యాంక్యూ బ్రదర్ సినిమా తో నేడు అనసూయ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆహా ఓటీటీ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్న థ్యాంక్యూ బ్రదర్‌ సినిమా కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

 Anasuya Thank You Brother Movie Now Streaming In Aha Ott-అనసూయ నువ్వు గ్రేట్‌.. ఆహా అనిపించారు మేడం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా అనసూయ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అందరి అభినందనలు దక్కించుకుంటుంది.దర్శకుడు అనసూయ పాత్రను అద్బుతంగా మలిచాడు అంటూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది.

థ్యాంక్యూ బ్రదర్‌ సినిమా లో అనసూయ నిండు గర్భిణి పాత్ర లో కనిపించబోతున్నట్లుగా టీజర్ మరియు ట్రైలర్ తోనే తేలిపోయింది.గ్లామర్ పాత్రలో అనసూయను చూడాలనుకున్న అభిమానులు ఇలా గర్బిణిగా చూస్తారా అనే అనుమానం కొందరు వ్యక్తం చేశారు.

కాని సినిమా విడుదల తర్వాత అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.థ్యాంక్యూ బ్రదర్ సినిమా లో అనసూయ నిండు గర్బిణిగా కనబర్చిన నటన అద్బుతం అంటూ అభినందనలు దక్కించుకుంది.

ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేందుకు పడే కష్టంను మరియు ఆ సమయంలో ఆమె మానసిక సంఘర్షణను సినిమా లో చక్కగా చూపించారు.ఇలాంటి పాత్రలను ఒప్పుకోవాలంటే ఘట్స్ ఉండాలి.

అందుకే అనసూయను సోషల్‌ మీడియా గ్రేట్‌.సినిమాలోని మీ పాత్రతో ఆహా అనిపించారు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 అనసూయ ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా ఇలా పాత్ర కు ప్రాముఖ్యత ఉన్న సినిమా లు కూడా చేయగలదు అని నిరూపించుకుంది.

#Anasuya #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు