ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ అనసూయ..?  

Anasuya Telugu Anchor Tollywood - Telugu Anasuya, Andhra Pradesh, Politics, Telugu Anchor, Tollywood

తెలుగు బుల్లితెరలో తన గలగల మాటలతో మరియు అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ కామెడీ షో అయినటువంటి జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే, మరో పక్క పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ దూసుకుపోతోంది.

 Anasuya Telugu Anchor Tollywood

అయితే తాజాగా యాంకర్ అనసూయ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం యాంకర్ అనసూయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టిసారించిందని, ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు యాంకర్ అనసూయకి తమ పార్టీ లోకి ఆహ్వానం పంపినట్లు కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో బలంగా చర్చించుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ అనసూయ..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే యాంకర్ అనసూయ అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కినటువంటి “యాత్ర” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడి భార్య పాత్ర పోషించింది.అయితే అప్పటి నుంచే ఈ రాజకీయ చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది.

కానీ అనసూయ మాత్రం తన రాజకీయ ప్రవేశం గురించి వస్తున్నటువంటి వార్తలపై ఇప్పటివరకు స్పందించడం లేదు.

 అయితే ఈ విషయం ఇలా ఉండగా  ప్రస్తుతం యాంకర్ అనసూయ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి ఫైటర్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న టువంటి పుష్ప అనే చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anasuya Telugu Anchor Tollywood Related Telugu News,Photos/Pics,Images..

footer-test