అలాంటి బట్టలు వేసుకోకు మమ్మీ.. అనసూయకు కొడుకు ఝలక్..?

బుల్లితెరపై పదుల సంఖ్యలో షోలకు హోస్ట్ గా వ్యవహరించి, సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ అనసూయ గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా ఒక ఇంటర్యూలో మాట్లాడిన అనసూయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలకు సంబంధించి, సినిమా ఆఫర్లకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Anasuya Son Comments About Her Dressing, Anasuya Son, Comments About Dressing,-TeluguStop.com

యాంకర్ స్వప్న పిల్లలు మమ్మీని చూసి ఏమంటారని ప్రశ్నించగా తన పెద్ద కొడుకు కొన్ని దుస్తుల విషయంలో అభ్యంతరం చెబుతాడని ఆమె తెలిపారు.

క్రాప్ టాప్ ల విషయంలో పెద్దగా ఉన్న క్రాప్ టాప్ లు వేసుకోవాలని పెద్ద కొడుకు సూచిస్తాడని అనసూయ అన్నారు.

తనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తాడని అనసూయ పేర్కొన్నారు.అయితే తాను కొడుకుకు కంఫర్ట్ గా ఉండే నచ్చిన దుస్తులను వేసుకుంటానని చెబుతానని పేర్కొన్నారు.నువ్వు వేసుకునే టీషర్ట్ నచ్చకపోయినా నీకు ఇష్టం అనే రీజన్ వల్ల తాను అభ్యంతరం చెప్పనని కొడుకుకు చెబుతానని అనసూయ తెలిపారు.

తన ఫ్యామిలీ గురించి చెబుతూ తాను డిగ్రీ చదివే వరకు ఇంట్లో ఎంతో రిస్ట్రిక్షన్స్ ఉండేవని అమ్మ తాను ఏ బట్టలు వేసుకోవాలో అవి తీసిపెట్టేవారని అనసూయ అన్నారు.

తాను రిలేషన్స్ కు రెస్పెక్ట్, వాల్యూ ఇస్తానని నా శరీరాన్ని నేను దేవాలయంగా భావిస్తానని అనసూయ అన్నారు.తనకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందని అనసూయ అభిమానులను తెలియని విషయాన్ని వెల్లడించారు.

Telugu Anasuya Son, Crop Tops, Mammutty-Movie

కూతురు లేకపోవడం గురించి స్పందిస్తూ తనకు కూతురు అంటే ఇష్టమని అనసూయ తెలిపారు.ఇల్లు చక్కబెట్టాలంటే ఆడపిల్ల కచ్చితంగా ఉండాలని అనసూయ పేర్కొన్నారు.అనసూయకు తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.మలయాళంలో మమ్ముట్టికి జోడీగా అనసూయ నటిస్తున్నారు.గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకే తాను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని అనసూయ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube