జబర్దస్త్ కు అందుకే దూరమయ్యా.. ఊబిలో చిక్కుకోను.. గొర్రెల మంద అంటూ?

బుల్లితెర ప్రముఖ యాంకర్లలో ఒకరైన అనసూయ జబర్దస్త్ షోకు దూరం కావడం గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చర్చ జరగడంతో పాటు చాలామంది జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై చెప్పడంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇతర ఛానెళ్ల నుంచి మంచి ఆఫర్లు రావడం వల్లే ఈ షోకు అనసూయ దూరమయ్యారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

 Anasuya Shocking Comments About Jabardasth Show Goes Viral In Social Media , Anasuya , Jabardsath , Roja , Naga Babu , Tollywood, Pushpa-TeluguStop.com

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ తన గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

జబర్దస్త్ నా మనస్సుకు దగ్గరైన షో కావడంతో పాటు నాకు ఎంతో ఇష్టమైన షో అని ఆమె అన్నారు.

 Anasuya Shocking Comments About Jabardasth Show Goes Viral In Social Media , Anasuya , Jabardsath , Roja , Naga Babu , Tollywood, Pushpa-జబర్దస్త్ కు అందుకే దూరమయ్యా.. ఊబిలో చిక్కుకోను.. గొర్రెల మంద అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి జబర్దస్త్ షోను నేను వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆమె కామెంట్లు చేశారు.జబర్దస్త్ షోలో అందరం కుటుంబంలా ఉండేవాళ్లమని ఆ షోకు దిష్టి తగిలిందని ఆమె చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ లో ఉండేవాళ్లంతా మంచివాళ్లు అని అయితే ఆ షోను కొన్ని వివాదాలు చుట్టుముట్టాయని అనసూయ కామెంట్లు చేశారు.గత రెండేళ్ల నుంచి జబర్దస్త్ షోకు దూరం కావాలని నేను అనుకుంటున్నానని ఆమె అన్నారు.

నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి జబర్దస్త్ మానేశానని ఆమె తెలిపారు.నా సినిమా షూటింగ్ వల్ల జబర్దస్త్ షెడ్యూల్ మార్చాల్సి వస్తే గిల్టీగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.

నాపై పంచ్ లు వేస్తే నేను సీరియస్ గా రియాక్ట్ అయినా చూపించరని అనసూయ అన్నారు.నాకు నచ్చని సందర్భాలు ఉన్నాయని కానీ ఊబిలో చిక్కుకోవాలని నేను అనుకోవడం లేదని ఆమె వెల్లడించారు.

Telugu Anasuya, Jabardasth Show, Jabardsath, Naga Babu, Pushpa, Roja, Tollywood-Movie

నాగబాబుగారు, రోజాగారు వెళ్లిపోవడం వల్లే నేను వెళ్లిపోయానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అనసూయ అన్నారు.వాళ్లు వెళ్లిపోయారని వెళ్లిపోవడానికి నేను గొర్రెలమంద రకం కాదని ఆమె తెలిపారు.చాలారోజుల క్రితం ఒక గొర్రెల మంద నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నించిందని అనసూయ షాకింగ్ కామెంట్లు చేశారు.అనసూయ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube