థాంక్యూ బ్రదర్ అంటున్న అనసూయ  

Anasuya Says Thank You Brother, Tollywood, Telugu Cinema, Hot Anchor, Jabardasth Anchor, Hot Beauties - Telugu Anasuya Bharadwaj, Hot Anchor, Hot Beauties, Jabardasth Anchor, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ హీరోయిన్లుకి పోటీనిచ్చే అందంతో, అంతకుమించి అభినయంతో నటిగా దూసుకుపోతున్న అందాల భామ, హాట్ యాంకర్ అనసూయ.జబర్దస్త్ షోతో హాట్ యాంకర్ అవతారం ఎత్తి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడుకి అడవి శేష్ క్షణం సినిమాలో మొదటి అవకాశం ఇచ్చాడు.

TeluguStop.com - Anasuya Says Thank You Brother

ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో అందరి దృష్టిని అనసూయ ఆకర్షించింది.తరువాత సుకుమార్ రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర ఆమె ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది.

అందులో రామ్ చరణ్ తో సమానంగా అనసూయ పాత్ర ఉంటుంది.ఈ పాత్ర ప్రభావంతో ఒక్కసారిగా అనసూయకి నటిగా అవకాశాలు పెరిగిపోయాయి.

TeluguStop.com - థాంక్యూ బ్రదర్ అంటున్న అనసూయ-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఆమె చేతిలో రంగమార్తాండ సినిమాతో పాటు ఆచార్య, సుకుమార్ పుష్ప సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకుంటూ వెళ్తున్న అనసూయ మరో వైపు మెయిన్ లీడ్ లో ఫిమేల్ సెంట్రిక్ కథలతో కూడా తన సత్తా చాటాలని అనుకుంటుంది.ఇప్పటికే కథనం అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసింది.అయితే ఆ సినిమాలో కథలో కొత్తదనం ఉన్న కథనంలో లేకపోవడం కథనం సినిమా ఎవరికీ కనెక్ట్ కాలేదు.

అయితే చాలా గ్యాప్ తీసుకొని మరల కొత్త సినిమాని అనసూయ కన్ఫర్మ్ చేసింది.థాంక్యూ బ్రదర్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని రానా చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సినిమాతో రమేష్ రాపర్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఇందులో కరోనా లాక్ డౌన్ టైంలో జరిగే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.

#Hot Anchor #Hot Beauties

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anasuya Says Thank You Brother Related Telugu News,Photos/Pics,Images..