వామ్మో.. నా వల్ల కాదంటున్న అనసూయ!

బుల్లితెరపై తన హాట్ అందాలతో వేడి పుట్టించేవారిలో యాంకర్ అనసూయ మొదటిస్థానంలో ఉంటుంది.ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

 Anasuya Says She Will Never Quit Jabardasth-TeluguStop.com

ఈ షో ఇంతగా సక్సెస్ కావడంలో అనసూయ పాత్ర కూడా ఉంది.అమ్మడు వేసుకునే డ్రెస్సులు మొదలుకొని ఆమె చూపించే అందాల వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే ఇటీవల జబర్దస్త్ కామెడీ షో గురించి పలు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ షో నుండి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు.

ఆయన ఈ షో నుండి ఎందుకు వెళ్లిపోతున్నాడో కూడా తెలిపాడు.అయితే అటు యాంకర్ అనసూయ కూడా ఈ షో నుండి వెళ్లిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

వాటిపై స్పందించిన అనసూయ, వామ్మో జబర్దస్త్ షో నుండి వెళ్లిపోవడం తన వల్ల కాదని తెలిపింది.తనకింత ఫేం తెచ్చిన ఈ కామెడీ షో నుండి వెళ్లిపోవడం అసలు తన ఊహకే రాలేదని ఆమె తెలిపింది.

ఏదేమైనా తనకింత పేరును తెచ్చిపెట్టిన జబర్దస్త్ షో నుండి తాను వెళ్లిపోతున్నట్లు ఎవరో కావాలనే పుకార్లు సృష్టిస్తున్నారంటూ అనసూయ మండిపడింది.తాను మాత్రం జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదని అనసూయ చెప్పుకొచ్చింది.

ఇక నాగబాబు స్థానంలో జడ్జిగా ఎవరు వస్తారనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube