బిగ్ బాస్ వదులుకోవడానికి గల అసలు కారణం చెప్పిన అనసూయ  

Anasuya Says Reason Behind Big Boss Reject -

ఓ వైపు హాట్ యాంకర్ గా, మరో వైపు నటిగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసే దిశగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ అనసూయ.ఇద్దరు పిల్లల తల్లి అయిన అదే గ్లామర్ మెయింటేన్ చేస్తూ, ఓ వైపు తల్లిగా, మరో వైపు సెలబ్రిటీగా రెండు బాద్యతలకి సమర్దవంతంగా నిర్వహిస్తుంది.

Anasuya Says Reason Behind Big Boss Reject

ఎంత రంగుల ప్రపంచంలో ఉన్న కూడా భర్త, పిల్లల కోసం కొంత సమయం కేటాయించే అనసూయకి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉండి.ప్రస్తుతం ఆమె సోలోగా కీలక పాత్రలో చేస్తున్న కథనం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సీజన్ బిగ్ బాస్ షో లో అనసూయ కూడా పాల్గొంటుంది అని ప్రచారం జరిగింది.తాజాగా ఇదే విషయం మీద ఆమె వివరణ ఇచ్చింది.

బిగ్ బాస్ వదులుకోవడానికి గల అసలు కారణం చెప్పిన అనసూయ-Movie-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ షో కోసం న‌న్ను సంప్ర‌దించారు.కానీ నేను ఒప్పుకోలేదు.

ఇంటినీ, పిల్ల‌ల్నీ వ‌దిలి నేనేం చేయ‌లేను.ఒక్క‌రోజు పిల్ల‌ల్ని చూడ‌క‌పోయినా.

బెంగ వ‌చ్చేస్తుంది.సెట్లోంచే వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటా.

వాళ్ల‌ని అన్ని రోజులు మిస్ అవ్వ‌డం అంటే చాలా క‌ష్టం.అందుకే బిగ్ బాస్ షోకి దూర‌మ‌య్యా” అంటోంది.

మొత్తానికి తల్లిగా అనసూయ తన పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.మోడరన్ డ్రెస్సులు వేసిన అందరూ కుటుంబాన్ని పట్టించుకోరు అనే విమర్శలు అనసూయ విషయంలో మాత్రం వర్తించవని ఈ మాటల బట్టి అర్ధమవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anasuya Says Reason Behind Big Boss Reject- Related....