భర్తపై ప్రేమను బయటపెట్టిన అనసూయ.. గట్టిగా హగ్ చేసుకుని..?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒకవైపు టీవీ షోలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉండే అనసూయ ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తున్నారు.

 Anasuya Says I Love You To Shashank Bharadwaj-TeluguStop.com

చాలామంది యాంకర్లు పెళ్లైతే అవకాశాలు తగ్గుతాయని పెళ్లికి దూరంగా ఉంటే అనసూయ మాత్రం పెళ్లి తర్వాత యాంకర్ గా వరుస అవకాశాలతో బిజీ అవుతుండటం గమనార్హం.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన షోలకు సంబంధించిన ఫోటోలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

 Anasuya Says I Love You To Shashank Bharadwaj-భర్తపై ప్రేమను బయటపెట్టిన అనసూయ.. గట్టిగా హగ్ చేసుకుని..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న వాలెంటైన్స్ డే కాగా అనసూయ ప్రేమికుల రోజు సందర్భంగా భర్తను గట్టిగా హగ్ చేసుకున్న ఒక ఫోటోను షేర్ చేశారు.ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఫోటోకు ఏకంగా 25,000 లైకులు రావడం గమనార్హం.

అనసూయ తన ఫేస్ బుక్ ఖాతాలో ఫోటోను షేర్ చేయడంతో పాటు తన భర్త సుశాంక్ భరద్వాజ్ కు ఐలవ్యూ చెప్పారు.అనసూయ షేర్ చేసిన ఫోటోపై కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు.అయితే అనసూయ తన భర్తపై ఎంత ప్రేమ ఉందో ఆ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పేశారు.మరి కొందరు నెటిజన్లు మాత్రం అనసూయకు ఐలవ్యూ చెబుతూ కామెంట్లు చేయడం గమనార్హం.

మరోవైపు అనసూయ రవితేజ ఖిలాడీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా అనసూయ యంగ్ గానే కనిపిస్తూ సినీ, టీవీ రంగాల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.ఖిలాడీ సినిమాతో పాటు రంగమార్తాండ సినిమాలో తమిళంలో ఒక సినిమాలో అనసూయ నటిస్తున్నారు.

#Rangamartnada #Khiladi #Anchor Anasuya #Jabardasth #Ilove You

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు