థ్యాంక్యూ బ్రదర్‌ అనసూయ తప్పుడు నిర్ణయమా?

పెళ్లి అయ్యి ఇరవై ఏళ్లు కావస్తున్నా ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అనసూయను ఆమె అభిమానులు అందాల దేవతగా కొలుస్తారు.ఆమెను సోషల్‌ మీడియా లో ఆరాధించే వారు ఎంతో మంది ఉన్నారు.

 Anasuya Ott Film Thank You Brother Release Very Soon , Aha Ott , Anasuya,  Anasu-TeluguStop.com

అలాంటి అనసూయను జనాలు మరో రకంగా చూడాలంటే మాత్రం కష్టం.జబర్దస్త్‌ షో ను యాంకర్‌ అనసూయ కోసం చూసే వారు ఎక్కువ మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు.

అలాంటి అనసూయ ను థ్యాంక్యూ బ్రదర్‌ సినిమా లో నిండు గర్బిణిగా డీ గ్లామర్ పాత్రలో చూపించబోతున్నారు.మే మొదటి వారంలో స్ట్రీమింగ్‌ కు సిద్దం అవుతున్న థ్యాంక్యూ బ్రదర్‌ సినిమా పై జనాల్లో ఆసక్తి ఉన్నట్లుగా అయితే అనిపించడం లేదు.

ఎందుకంటే అనసూయను ఆ రకంగా చూడాలని ఎవరు భావించడం లేదట.

థ్యాంక్యూ బ్రదర్‌ లో అనసూయ పూర్తి స్థాయి లో నిండు గర్బిణి గా కనిపించబోతుంది.

అందుకు సంబంధించిన టీజర్‌ మరియు ట్రైలర్‌ లు వచ్చాయి.సినిమా లో ఆమె పాత్ర ఆమె నటనకు మంచి మార్కులు తెచ్చేలా ఉంటుందని అంటున్నారు.

కాని అనసూయ ను మాత్రం గ్లామర్ గా చూడాలనుకున్న వారికి ఇది తలకు ఎక్కే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ సినిమా ను తెలుగు లో చాలా విభిన్నమైన ఎప్పుడు రాని కాన్సెప్ట్‌ తో తీసుకు రాబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఒక నిండు గర్బిణి లిఫ్ట్‌ లో ఇరుక్కు పోతే జరిగే పరిణామాలు ఏంటీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ. అనసూయ నుండి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉండే పాత్రను ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటే ఆమె మాత్రం థ్యాంక్యూ బ్రదర్‌ అంటోంది.మరి ఆ సినిమా ఎంత వరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.సినిమా ను ప్లాప్ చేసి ఆమె నిర్ణయంను తప్పుడు నిర్ణయంగా ప్రేక్షకులు ఖరారు చేస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube