పుష్ప సినిమాకి అనసూయ పాత్రనే కీలకం అంటా

జబర్దస్త్ కామెడీ షోతో ఒక్కసారిగా పాపులర్ అయిన బ్యూటీ అనసూయ.ఈ అమ్మడు తన గ్లామర్ షోతో యాంకరింగ్ కి కొత్త కళ తీసుకొచ్చింది.

 Anasuya Open Up Her Role In Pushpa Movie-TeluguStop.com

ఈమెని అనుసరిస్తూ తరువాత చాలా మంది హాట్ బ్యూటీస్ యాంకరింగ్ వైపు అడుగులు వేసి తన గ్లామర్ షోతో రాణిస్తున్నారు.ఇక ఈ బ్యూటీ క్షణం సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది.

ఆ సినిమా అనసూయకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.తరువాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర అనసూయ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.

 Anasuya Open Up Her Role In Pushpa Movie-పుష్ప సినిమాకి అనసూయ పాత్రనే కీలకం అంటా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెని మార్చేసింది.ఈ సినిమా ఎఫెక్ట్ తో మరికొన్ని సినిమాలు అనసూయ ఖాతాలో వచ్చి పడ్డాయి.

తరువాత లీడ్ రోల్ లో కథనం అనే సినిమా చేసిన అది వర్క్ అవుట్ కాలేదు.ఐటెమ్ భామగా రెండు సినిమాలలో నటించి కుర్రకారుకి హీట్ పెంచింది.

ఇదిలా ఉంటే ఆమె లీడ్ రోల్ లో నటించిన థాంక్యూ బ్రదర్ అనే సినిమా ఒటీటీలో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమాలో ఆమె గర్భిణీ పాత్రలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే సుకుమార్ మరోసారి అనసూయని అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఎంపిక చేశాడు.ఈ సినిమాలో ఆమెకి ఓ స్ట్రాంగ్ రోల్ ని ఇచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అనసూయ కొంత వరకు రివీల్ చేసింది.పుష్ప సినిమాలో తాను ఏ పాత్రలో నటిస్తున్న అనే విషయం చెప్పను కాని ఆ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని మాత్రం చెప్పగలను.

కథని పూర్తిగా మలుపు తిప్పే పాత్రలో తాను కనిపించబోతున్న అని చూచాయగా తన రోల్ పై అనసూయ హిట్ ఇచ్చింది.మొత్తానికి సుకుమార్ అనసూయకి తన సినిమాల ద్వారా గట్టిగానే ప్రమోషన్ ఇస్తున్నాడని దీనిని బట్టి తెలుస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.

#Allu Arjun #Anasuya #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు