సిల్క్‌ స్మిత పాత్రపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్‌ రంగమ్మత్త

ఇటీవల జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఒక ఫొటోను షేర్‌ చేసింది.తమిళ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాను అంది.

 Anasuya Not Doing Silk Smitha Bio Pic Movie, Rangammatha, Jabardast, Roja, Rashm-TeluguStop.com

అదే సమయంలో విజయ్‌ సేతుపతితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్‌ చేసింది.అనసూయ సోలోగా ఉన్న పాత్రలో ఆమె లుక్‌ అచ్చు గుద్దినట్లుగా సిల్క్‌ స్మిత ను పోలి ఉంది.

దాంతో మరో సిల్క్‌ సినిమా రాబోతుంది అంటూ నెటిజన్స్‌ మరియు సినీ వర్గాల వారు చాలా బలంగా ప్రచారం చేశారు.ఇప్పటికే వచ్చిన డర్టీ పిక్చర్‌ సినిమాకు ఇది పోటీ అన్నట్లుగా ఉంటుందా అంటూ కొందరు అంచనాలు పెట్టుకోగా మరి కొందరు మాత్రం ఈ సినిమా ఓ రేంజ్‌ లో ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నామన్నారు.

కాని అసలు విషయంను తాజాగా అనసూయ తాపీగా వెళ్లడించి అభిమానులను ఉసూరుమనిపించింది.

అసలు తనను సిల్క్‌ స్మిత గారి పాత్ర ను చేయాల్సిందిగా ఎవరు సంప్రదించలేదు.నేను చేస్తున్నది అసలు సిల్క్‌ గారి పాత్ర కానే కాదు.మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

తమిళంలో సినిమా చేస్తున్న మాట వాస్తవమే అవ్వడం వల్ల ఆ సినిమాలో ఒక పాత్ర కోసం కాస్త అటు ఇటుగా సిల్క్‌ లా కనిపించబోతుందేమో అంటున్నారు.అంతే తప్ప అను ఏమీ ఆ పాత్రలో నటించడం లేదు అంటూ తేలిపోయింది.

తెలుగులో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్న అనసూయ తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో వరుసగా సినిమాలు వస్తున్న కారణంగా ఈమెకు బుల్లి తెరతో బందం తెగిపోయే అవకాశం ఉందేమో అంటున్నారు.మొత్తానికి అనసూయ వరుసగా చేస్తున్న సినిమాలతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలు అది కూడా పెద్ద పిల్లలు ఉన్న అనసూయ పాతికేళ్ల అమ్మాయి మాదిరిగా వరుసగా సినిమాలు చేయడం మంచి ఫిజిక్‌ ను మెంటెన్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube