బుల్లితెర యాంకర్ గా పలు కార్యక్రమాలకు యాంకర్ యొక్క వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఇలా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.
ఇలా జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ మెల్లమెల్లగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమెకు రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చింది.ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు అప్పటినుంచి ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు చేయాలి అంటే తనకు ఏమాత్రం సమయం కుదరడం లేకపోవడంతో బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు ప్రస్తుతం వెళ్లితెరపై వరుస సినిమాలలో విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇటీవల ఈమె రజాకర్( Razakar ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు సంచలనంగా మారుతూ వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.ఇలా వివాదాల ద్వారా( Controversies ) కూడా ఈమె వార్తలలో నిలిచారు కానీ ఇటీవల కాలంలో అనసూయ వివాదాలకు దూరంగా ఉంటున్నారని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పొట్టి గౌను ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ పొట్టి డ్రెస్సులు( Short Dresses ) వివిధ భంగిమలలో ఫోటోలు దిగినటువంటి ఈమె ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ అనసూయ కామెంట్ పెట్టింది.తనని ట్రోల్ చేసే హేటర్స్ కోసమే అనసూయ ఈ క్యాప్షన్ పెట్టింది అని నెటిజన్లు( Netizens Comments ) కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.