సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త ఇంటర్నెట్లో వినిపిస్తుంది అంటే కొందరు నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అసలు ఇంతకీ ఆ వార్త నిజమా కాదా అని కూడా ఆలోచించకుండా తెగ సలహాలు, సూచనలు, ట్రోల్స్ వంటివి చేస్తుంటారు.అయితే తాజాగా టాలీవుడ్ యాంకర్ అనసూయ విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతోంది.
ఇటీవలే జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు కొన్ని వార్తలు ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో కొందరు నెటిజన్లు రాజకీయాల్లో రాణించడమంటే జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నంత ఈజీ కాదని, అలాగే నీకు ఇంకా సినీ భవిష్యత్తు చాలా ఉందని కాబట్టి ప్రస్తుతానికి ఈ రాజకీయాలు మరియు ఇతర విషయాలను పక్కనపెట్టి తన సినీ జీవితంపై దృష్టి సారించాలని కొందరు నెటిజన్లు యాంకర్ అనసూయ కి సలహా ఇస్తున్నారు.
మరి కొంతమంది మాత్రం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యం కలిగినటువంటి యాంకర్ అనసూయను అభినందిస్తూ ప్రొసీడ్ అంటూ ప్రోత్సహిస్తున్నారు.అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో తన రాజకీయ ప్రవేశం గురించి ఇంత జరుగుతున్నప్పటికీ యాంకర్ అనసూయ మాత్రం అసలు స్పందించడం లేదు.
దీంతో యాంకర్ అనసూయ నిజంగానే రాజకీయాల్లోకి వస్తుందా లేక ఎవరైనా కట్టు కథలు అల్లుతున్నారా.? అనే అనుమానం కలుగుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ అనసూయ ఒకపక్క షోలు మరోపక్క సినిమాలంటూ బిజీ బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది.కాగా ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి ఆచార్య అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు పూర్తయ్యాయి.అలాగే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప అనే చిత్రంలో కూడా యాంకర్ అనసూయ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.