ఈ సారి నల్ల చీరలో అందాలు ఆరబోస్తున్న హాట్ యాంకర్...  

Anasuya Looks Stunning In Black Saree -

టాలీవుడ్ లో వరుస అవకాశాలతో జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ దూసుకుపోతోంది.అంతేకాకుండా ఈ అమ్మడు ప్రస్తుతం చానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని ఛానళ్లను చుట్టేస్తూ టాలీవుడ్ యాంకర్ లిస్టులో తన హవా కొనసాగిస్తోంది.

Anasuya Looks Stunning In Black Saree

అయితే నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ ఫోటోషూట్ లతో తన అభిమానులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది.

అయితే తాజాగా యాంకర్ అనసూయ ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.

ఇందులో భాగంగా అనసూయ నల్ల చీర లో తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అలాగే ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

దీంతో అనసూయ అందానికి తన అభిమానులు మంత్రముగ్ధులు అయ్యారు.అలాగే 35 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ తన అందాలతో కుర్రకారుకి అనసూయ మత్తెక్కిస్తోందని అంటున్నారు.

మరి కొదంరైతే అల వైకుంఠపురములో చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్ పూజా హెగ్డే ని చూసి చెప్పేటువంటి “మేడం సార్….మేడం అంతే” అనే డైలాగ్ ని కామెంట్ బాక్స్ లో వల్లిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి ఓ చిత్రంలో ను కీలక పాత్రలో నటిస్తోంది.అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ చిత్రాల్లో కూడా నటించే ఆకాశం దక్కించుకుంది ఈ అమ్మడు.

తాజా వార్తలు