వేదాంతం రాఘవయ్యలో కీలక పాత్రలో అనసూయ  

హాట్ యాంకర్ గా టెలివిజన్ తెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనసూయ.ఈ అమ్మడు పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో యాంకరింగ్ కెరియర్ స్టార్ట్ చేసింది.

TeluguStop.com - Anasuya Lead Role In Sunil Vedantham Raghavayya Movie

జబర్దస్త్ లో మోడ్రన్ డ్రెస్సులుతో హాట్ లుక్స్ తో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి షోకి మంచి హైప్ తీసుకొచ్చింది.తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ యాంకర్ గా మారిపోయింది.

రెగ్యులర్ ట్రెడిషనల్ యాంకర్స్ ని మాత్రమే చూసిన టెలివిజన్ పై మొదటిసారి హాట్ యాంకర్ గా అనసూయని చూసేసరికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.ఆమెని అనుసరిస్తూ రష్మీ, వర్షిణి, విష్ణుప్రియా లాంటి కొత్త కొత్త యాంకర్ టెలివిజన్ పై తమ హాట్ లుక్స్ అవకాశాలు పెంచుకున్నారు.

TeluguStop.com - వేదాంతం రాఘవయ్యలో కీలక పాత్రలో అనసూయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అనసూయ క్షణం సినిమాతో నటిగా కూడా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే అవార్డులు కూడా సొంతం చేసుకుంది.పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెస్మరైజ్ చేసింది.

తరువాత రంగస్థలం సినిమా ఆమెకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది.అందులో చేసిన రంగమ్మత్త పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.

తరువాత వరుసగా ఈ భామకి అవకాశాలు వచ్చాయి.అయితే రెగ్యులర్ గా ఎలా పడితే అలా సినిమాలు చేయకుండా తన ఐడెంటిటీ ఉండే కథలని ఎంచుకుంటుంది.ప్రస్తుతం అనసూయ చేతిలో ఒక నాలుగు సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ స్థాయి పాత్రలో ఒక సినిమాలో నటించబోతుంది.

సునీల్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లో వేదాంతం రాఘవయ్య అనే సినిమా స్టార్ట్ అయ్యింది.చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ కథ అందించారు.

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అనసూయని ఫైనల్ చేశారు.ఇందులో ఒక హీరోయిన్ గా పూర్ణ నటిస్తుందని టాక్ ఉంది.

ఇప్పుడు హీరోయిన్ రేంజ్ పాత్రలోనే అనసూయని కూడా కన్ఫర్మ్ చేశారని టాక్ వినిపిస్తుంది.

#Chandramohan #Hero Sunil #Actress Poorna #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anasuya Lead Role In Sunil Vedantham Raghavayya Movie Related Telugu News,Photos/Pics,Images..