తనకు అత్యాశ ఎక్కువని ఒప్పుకున్న యాంకర్ అనసూయ!  

anchor anasuya admitted that she was too greedy Anasuya, Jabardasth, Star Maa, Zee Telugu Channel, Suma, Venu, Diffrence Between The Hope And Greed - Telugu @anusuyakhasba, Anasuya, Anchor Anasuya Admitted That She Was Too Greedy, Diffrence Between The Hope And Greed, Jabardasth, Star Maa, Suma, Venu, Zee Telugu Channel

బుల్లితెర లేడీ యాంకర్లలో ఒకరైన అనసూయ ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉంటుంది.మనసులో ఏదీ దాచుకోకుండా తన అభిప్రాయాలను బయటకు వ్యక్తం చేస్తుంది.

TeluguStop.com - Anasuya Jabardasth Hope Greedy

కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే ఆ విమర్శలకు అనసూయ ధీటుగా స్పందించి వార్తల్లో నిలిచింది.జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ తాజాగా ఓ ఈవెంట్ లో తనకు అత్యాశ ఎక్కువని అంగీకరించింది.

ప్రత్యక్షంగా ఆ మాట చెప్పకపోయినా పరోక్షంగా ఆమె తనకు అత్యాశ ఎక్కువే అని చెప్పడం గమనార్హం.జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ మొదట్లో ఆ షోకు మాత్రమే పరిమితం కాగా ఆ తరువాత స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఒక షోకు యాంకర్ గా చేసింది.

TeluguStop.com - తనకు అత్యాశ ఎక్కువని ఒప్పుకున్న యాంకర్ అనసూయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గత కొన్ని నెలల నుంచి అనసూయ జీ తెలుగు ఛానల్ లోని ప్రోగ్రామ్ లతో పాటు ఈవెంట్లలో కూడా సందడి చేస్తోంది.గతంలో ఒక ఛానల్ లో యాంకర్లు ఆ ఛానల్ లో తప్ప మరే ఛానల్ లో పని చేయకూడదని కొన్ని ఛానెళ్లు నియమనిబంధనలు విధించాయి.

అయితే సుమ, అనసూయ లాంటి టాప్ యాంకర్లకు మాత్రం షరతులు వర్తించవు.అందువల్లే వాళ్లు అన్ని టీవీ ఛానెళ్లలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు.

అయితే మరి కొంతమంది మాత్రం ముందుగానే ఇతర ఛానెల్స్ లోని ప్రోగ్రామ్ లకు, ఈవెంట్కు వెళ్లమని అగ్రిమెంట్ ఇవ్వడం వల్ల కొన్ని చానెళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది.జీ తెలుగు దసరా ఈవెంట్ కు హాజరైన అనసూయను స్కిట్ లో భాగంగా వేణు ఆశకు, అత్యాశకు తేడా చెప్పాలని కోరాడు.

అందుకు అనసూయ సమాధానంగా ఆశ అంటే అక్కడ చేయడం, అత్యాశ అంటే అక్కడా ఇక్కడ చేయడం అని చెప్పింది.తాను ఈటీవీలోను, జీ తెలుగులోను చేయాలని అనుకుంటున్నానని అనసూయ పరోక్షంగా తెలిపింది.

#Jabardasth #@anusuyakhasba #AnchorAnasuya #Star Maa #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anasuya Jabardasth Hope Greedy Related Telugu News,Photos/Pics,Images..