అనసూయ లేడీ ఓరియంటెడ్‌ మూవీ... మలయాళ సినిమాకు సీక్వెల్‌

జబర్దస్త్‌ మాజీ యాంకర్ అనసూయ సినిమాల్లో బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.

 Anchor Anasuya To Do Lady Oriented Movie Malayalam Movie Remake,anchor Anasuya ,-TeluguStop.com

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా నటించేందుకు అనసూయ ఓకే చెప్పింది.తాజాగా ఒక మలయాళం సినిమా ను రీమేక్‌ చేసేందుకు ఈమె ఓకే చెప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లేడీ ఓరియంటెడ్‌ సినిమా గాఈ రీమేక్ రూపొందబోతుంది.అతి త్వరలోనే షూటింగ్ ను ప్రాంభించబోతున్నామని మేకర్స్‌ ఆఫ్‌ ది రికార్డ్‌ పేర్కొన్నారు.

అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది సమాచారం.ప్రస్తుతం అనసూయ పెద్ద సినిమాలు అంటే కేవలం పుష్ప 2 మాత్రమే చేస్తోంది.

పుష్ప 2 సినిమా యొక్క అంచనాలు భారీగా ఉన్నాయి.మరి అందులో ఈమె పాత్ర ఏంటీ అనేది క్లారిటీ లేదు.

Telugu Anasuya, Anchor Anasuya, Jabardasth, Lady, Makers, Malayalam, Pushpa, Tel

మరో వైపు అనసూయ చేయబోతున్న మలయాళ సినిమా రీమేక్ లేడీ ఓరియంటెడ్‌ అవ్వడంతో ఈ సినిమా తో మంచి పాపులారిటీని సొంతం చేసుకునే అవకాశం ఉంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కనుక అనసూయ ఈ సినిమా తో మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

Telugu Anasuya, Anchor Anasuya, Jabardasth, Lady, Makers, Malayalam, Pushpa, Tel

అనసూయ ఐటం సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.మళ్లీ మళ్లీ ఈమె నుండి ఐటం సాంగ్స్‌ ను అభిమానులు ఆశిస్తున్నారు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి అనేది టాక్‌.

అతి త్వరలోనే అనసూయ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.జబర్దస్త్ కార్యక్రమం నుండి తప్పుకున్న తర్వాత అనసూయ బుల్లి తెర షో ల్లో కనిపించడం లేదు.

బుల్లి తెర మరియు వెండి తెరపై కూడా ఆమెను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube