అనసూయని బాలీవుడ్ కూడా పిలుస్తుంది

హాట్ యాంకర్ గా తెలుగు టెలివిజన్ పై తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న అందాల భామ అనసూయ.ఈ అమ్మడు క్షణం సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేసింది.

 Anasuya Got Opportunities In Bollywood Also-TeluguStop.com

ఇక తరువాత రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ఆమె ఇమేజ్ ని ఒక్కసారిగా పెంచేసింది.దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

అయితే రెగ్యులర్ పాత్రలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రత్యేకత ఉన్న సినిమాలే చేస్తుంది.లీడ్ రోల్ లో కథనం అనే సినిమా చేసిన అది వర్క్ అవుట్ అవ్వలేదు.

 Anasuya Got Opportunities In Bollywood Also-అనసూయని బాలీవుడ్ కూడా పిలుస్తుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి.చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ ఒకటి చేసింది.

మరో వైపు మలయాళంలో కూడా తెరంగేట్రం చేసి మమ్ముట్టి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.మరో వైపు తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తుంది.

ఇలా సౌత్ భాషలలో ఇప్పటికే అనసూయ బ్రాండ్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే ఈ హాట్ యాంకర్ కి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.

ఈ విషయాన్ని తాజాగా ఈమెని బయటపెట్టింది.సౌత్ బాషలలోనే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా హిందీ సినిమాల కోసం సంప్రదిస్తున్నట్లు తెలిపింది.

అయితే ఏ సినిమా అయినా ప్రత్యేకత అనిపించే పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది.అలాగే తన మొదటి ప్రాధాన్యత యాంకరింగ్ అని స్పష్టం చేసింది.

యాంకర్ గా ఖాళీగా ఉన్న సమయాలలో సినిమాలు చేస్తానని తెలియజేసింది.ఇదిలా ఉంటే ఆమె లీడ్ రోల్ లో నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

ఇక సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

#Anasuya #@anusuyakhasba #South Beauties

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు