ట్రీట్ ఇవ్వడంలో బిజీగా ఉన్న అనసూయ..!

బుల్లి తెర నుండి మంచి క్రేజ్ సంపాదించుకొని వెండితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న యాంకర్, నటి అనసూయ.బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో నుండి యాంకర్ గా పరిచయమైన అనసూయ తన జీవితం యాంకర్ పాత్రతో ముగియకుండా.

 Anasuya Busy With Movies-TeluguStop.com

వెండితెర లో కూడా ఎన్నో పాత్రలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.ఇక తన అందంతో ఎంతో గ్లామర్ బ్యూటీగా విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న అనసూయ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీ గా ఉంది.ప్రస్తుతం ఆమె రేంజ్ అందనంత ఎత్తులో ఉండగా.ఏదో ఒక విషయం తో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది.వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంటుంది.

 Anasuya Busy With Movies-ట్రీట్ ఇవ్వడంలో బిజీగా ఉన్న అనసూయ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినిమాలలో కొన్ని ప్రధాన పాత్రలలో నటించిన అనసూయకు అంతగా గుర్తింపు లేకపోయినా.కొన్ని సినిమాలలో అతిథి పాత్రలో బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపిస్తుంది అనసూయ.

ఇదే కాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటిస్తుంది.

ఇక ఇటీవల విడుదలైన కార్తికేయ సినిమా చావు కబురు చల్లగా లో ఓ స్పెషల్ సాంగ్ లో కల్పించిన సంగతి తెలిసిందే.ఈ పాటతో అనసూయ మరింత గుర్తింపు అందుకుంది.

ఇక సిద్ధార్థ్ నటిస్తున్న మహా సముద్రం సినిమా లో కూడా ఓ స్పెషల్ పాత్రలో నటిస్తోంది.ఇక అనసూయ జబర్దస్త్ లోని యాంకర్ గా చేస్తూనే ఉంటూ.

వెండితెరపై కూడా బాధ్యతలను మోస్తుంది.మొత్తానికి బుల్లితెర, వెండి తెర లలో అనసూయ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెగ బిజీగా కనిపిస్తుంది.

రెండు వైపుల బాధ్యతలనే కాకుండా ఓవైపు కుటుంబ బాధ్యతలను కూడా మోస్తుంది అనసూయ.

#Treat #Jabardasth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు