అందరినీ అడుక్కుంటున్నాడు.. ఆది పరువు తీసిన అనసూయ..

బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి సంవత్సరాలు గడుస్తున్నా భారీగా టీఆర్పీ రేటింగ్ లు రావడానికి హైపర్ ఆది ఒక కారణమనే సంగతి తెలిసిందే.యూత్ కు నచ్చేలా అదిరిపోయే పంచ్ లతో స్కిట్లు చేస్తూ ఆది ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంటారు.

 Anasuya Bharadwaj Shocking Comments About Hyper Aadi, Hyper Aadi, Anasuya Bharad-TeluguStop.com

హైపర్ ఆది చేసే కొన్ని స్కిట్ల విషయంలో విమర్శలు వచ్చినా ఆ విమర్శలను పట్టించుకోకుండా ఆది మాత్రం మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తాజాగా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా ప్రోమోలో హైపర్ ఆది వేసిన పంచ్ లు కడుపుబ్బా నవ్వించాయి.

స్కిట్ లో హైపర్ ఆది గుడుంబా శంకర్ సినిమాలోని చుట్టుపక్కలేమవుతున్నా సాంగ్ తో పోలీస్ గెటప్ లో అమ్మాయితో కలిసి ఎంట్రీ ఇస్తాడు.హైపర్ ఆదితో వచ్చిన అమ్మాయి సెట్ లో ఎంతోమంది లేడీ గెటప్ వేసే వాళ్లు ఉండగా సెకండ్ టైమ్ కూడా నన్నే ఎందుకు పిలిచావ్ అని అడగగా నువ్వే కదా ఎవరూ పిలవట్లేదు మళ్లీ పిలవమని అడిగాంటూ పంచ్ వేస్తాడు.

ఆ తరువాత అమ్మాయి అవన్నీ ఇక్కడ చెబుతావేంటి అంటూ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది.ఆ తరువాత ఆ అమ్మాయి ” మీరేం చేస్తారో నాకు తెలీదండి.

మనిద్దరి గురించి ప్రతి వెబ్ సైట్ లోనూ, ప్రతి టీవీలోనూ పడాలి” అనగా ఆది “ఒక హగ్ ఇవ్వు వద్దన్నా ఇలాంటివి వస్తాయ్” అంటూ పంచ్ వేస్తాడు.ఆ తరువాత యాంకర్ అనసూయ ” ఏంటీ ఇలా తయారయ్యావ్” అని ఆదిని అడగగా రోజా నీవల్లే అని అనసూయను అంటారు.

ఆ తరువాత అనసూయ ” అందరినీ అడుక్కుంటున్నాడు హగ్ కావాలని” అని అనగా ఆది “వాళ్లూ ఒప్పుకోరు వీళ్లూ ఒప్పుకోరు ఎవరూ ఒప్పుకోరు ఛీ” అనిఅంటాడు.మార్చి నెల 18వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube