మరోసారి చర్చ.. అలాంటి అమ్మలే కావాలంటూ జబర్దస్త్ పోస్ట్ చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ?

Anasuya Bharadwaj Shares A Positive Story On Her Dressing

బుల్లితెర హాట్ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ గురించి అందరికీ పరిచయమే.తన యాంకరింగ్ కంటే తన అందాలతోనే కుర్రాళ్ళ మనసులు దోచుకుంది.

 Anasuya Bharadwaj Shares A Positive Story On Her Dressing-TeluguStop.com

పైగా బుల్లితెర పైన ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనసూయ.ఇక వెండితెరపై కూడా వరుస సినిమాలతో తన పాత్రలతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ పోస్ట్ చేసింది అనసూయ.

 Anasuya Bharadwaj Shares A Positive Story On Her Dressing-మరోసారి చర్చ.. అలాంటి అమ్మలే కావాలంటూ జబర్దస్త్ పోస్ట్ చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది అనసూయ.

నిజానికి బుల్లితెర కంటే ముందు వెండితెరపై పరిచయం కాగా బుల్లితెర పైనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.ఆ తర్వాత వెండితెరపై మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వగా అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ కొన్ని కొన్ని సార్లు బాగా విమర్శలు ఎదుర్కొంటోంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.అందులో తనకు నెగిటివ్ కామెంట్లు వస్తే చాలు వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది.

కొన్ని కొన్ని సార్లు బూతు మాటలతో కూడా రెచ్చిపోతుంది.చాలా వరకు ఆమె తన డ్రస్సింగ్ విషయంలోనే నెగటివ్ కామెంట్స్ ఎదుర్కొంటుంది.

కేవలం నెటిజన్ల నుంచే కాకుండా కొందరు సెలబ్రెటీల నుంచి కూడా అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో కొన్ని కామెంట్లు ఎదుర్కొంది.గతంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు అనసూయ వస్త్రధారణ తనకు నచ్చదని అనడంతో అప్పటి నుంచి అనసూయ మరింత రగిలిపోయింది.

తన వస్త్రధారణ తన ఇష్టమని ఎవరు తన వస్త్రధారణ గురించి తప్పుగా అంటే అస్సలు ఊరుకోనని తెలిపింది.

Telugu Anasuyakota, Jabardasth Show, Story, Tollywood-Movie

అంతేకాకుండా ఆడవాళ్ళు ధరించే బట్టలపై ఎందుకు మాట్లాడుతారు అంటూ హీరోలకు పెళ్లై పిల్లలు ఉన్న కూడా హీరోయిన్ లతో చిలిపి చేష్టలు చేస్తుంటారని మరి వాటి గురించి ఎందుకు ప్రశ్నించరని గట్టిగా ఫైర్ అయ్యింది.ఇక డ్రెస్సింగ్ విధానం గురించి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని జబర్దస్త్ లో ఓ స్కిట్ చేసి సరైన సమాధానం ఇచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది.

ఇక తన ఫేస్ బుక్ లో పోస్ట్ కూడా షేర్ చేసింది.అందులో ఓ నెటిజెన్ తన తల్లితో మాట్లాడిన కొన్ని విషయాలను అనసూయతో పంచుకున్నారు.హలో అనసూయ గారు అంటూ తను అనసూయతో ఓ చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు.జబర్దస్త్ కొత్తగా స్టార్ట్ అయిన రోజులని అందులో అనసూయ గోల్డ్ కలర్ డ్రెస్సులో యాంకరింగ్ చేసిందని అన్నారు.

Telugu Anasuyakota, Jabardasth Show, Story, Tollywood-Movie

ఆ సమయంలో తను తన తల్లితో.అమ్మ చూడు ఎంత పొడుగ్గా ఎంత అందంగా ఉందో అని అన్నారట.ఇక తన తల్లి కూడా అవును బాగుందని అన్నదట.కానీ డ్రెస్ చూడమ్మా ఎలా వేసుకుందో అని తను కామెంట్ చేయగా అప్పుడు తన తల్లి.తను ఏ డ్రెస్ వేసుకుంటే నీకేంటి బాధ.ఆమె కంఫర్ట్ గానే ఉంది కదా.హీరోయిన్స్ వేసుకుంటే పర్లేదు.యాంకర్ లు ఎందుకు వేసుకోకూడదు ఎవరి ఇష్టం వాళ్ళదని తన తల్లి అన్నదని తెలిపారు.

Telugu Anasuyakota, Jabardasth Show, Story, Tollywood-Movie

ఇక అప్పటి నుంచి తనలో ఆలోచన మొదలైందని ఇక అవతలి వారి ఇష్టాల గురించి కామెంట్ చేయడం మానేసానని తెలిపారు.ఇక అనసూయ మంచి అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ అని తనకు కూడా అని హ్యాపీ గా ఉండండని అనసూయకు మెసేజ్ చేయగా.ఇటువంటి మెసేజ్ తో ఉదయం ప్రారంభమవడం సంతోషంగా ఉందని స్పందించింది అనసూయ.అంతేకాకుండా ఇంత గొప్పగా ఆలోచించినందుకు తన తల్లికి థాంక్స్ చెబుతూ.ఈ ప్రపంచానికి అలాంటి అమ్మలే కావాలని జబర్దస్త్ పోస్టు చేసింది అనసూయ.

#Jabardasth Show #AnasuyaKota

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube