ఆ ఘటనపై విరుచుకుపడ్డ యాంకర్ అనసూయ!

ప్రపంచం వైరస్ ల వల్లనే కాకుండా.మరో ప్రకృతి ఒడిలో కూడా నలిగిపోతుంది.

 Anasuya Bharadwaj Reaction On Uttarakhand Glacier Incident, Anasuya Bharadwaj, U-TeluguStop.com

ఎటువైపు ఎటువంటి ప్రమాదాలు వస్తున్నాయో ఎవరు ఊహించలేక పోతున్నారు.గత ఏడాది కలుషితమైన గ్యాస్ లీక్ అవ్వడం, కరోనా వంటి పెద్ద వైరస్ లు రావడం, వరదలు వంటి పెద్ద పెద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

మొత్తానికి గత ఏడాది ప్రమాదాలతో గడవగా ఈ ఏడాది కూడా ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇటీవలే ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిన ఘటన అందరికీ తెలిసిందే.

ఈ ఘటన మన దేశాన్ని విషాదంలో ముంచగా 170 మంది వరదల్లో కొట్టుకుపోయరు.ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు బాగా కలిగాయి.

ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడ్డాయి.దీంతో ఇవి ధౌలీ గంగానదికి వరదగా బీభత్సం సృష్టించింది.

దీంతో నదిపై నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు.

Telugu Uttarakhand-Movie

ఈ ఘటన గురించి స్పందిస్తున్న యాంకర్ అనసూయ కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఈ విధంగా ట్విట్టర్ వేదికగా కొన్ని విషయాలు తెలుపుతూ.మరో ప్రకృతి విపత్తు చోటుచేసుకుందని, ప్రకృతిని కాపాడుతూ సహజీవనం చేయాల్సిన సమయం ఇకనైనా వస్తుందా అంటూ.

మనకు గుణపాఠం నేర్చుకోవాలంటే ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చూడాలి అంటూ ట్వీట్ చేసింది.ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాల గురించి తీసుకోవాల్సిన బాధ్యతలు మనవే అంటూ అనసూయ చెప్పిన మాటలో అర్థం అవుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ బుల్లి తెర నుండి వెండితెర పై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తూ టాలీవుడ్ సినిమాలలో నటిస్తుంది.

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అంతేకాకుండా చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube