అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమేనని చెబుతున్న అనసూయ.. కానీ?

బుల్లితెర యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకోగా ఆ షో ద్వారా అనసూయకు సినిమా ఆఫర్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.వెండితెరపై ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ అనసూయ నటిగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

 Anasuya Bharadwaj Open Up Mother Characters To Heroines In Movies-TeluguStop.com

వెండితెరపై అనసూయ కీలక పాత్రల్లో నటించిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడం గమనార్హం.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రకు అనసూయకు ప్రశంసలు దక్కాయి.

Telugu Anasuya Bharadwaj, Heroines In Movies, Interesting Facts, Mother Characters-Movie

ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.సినిమాలలో పాత్రల గురించి స్పందిస్తూ ఒకే తరహా పాత్రలు తాను చేయాలని భావించడం లేదని పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి తాను సిద్ధమేనని అనసూయ చెప్పుకొచ్చారు.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోహీరోయిన్లకు అమ్మ పాత్రలలో నటించడానికి కూడా తనకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు.

 Anasuya Bharadwaj Open Up Mother Characters To Heroines In Movies-అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమేనని చెబుతున్న అనసూయ.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే హీరోహీరోయిన్లకు అమ్మ పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు బయటకు వచ్చిన తరువాత తన పాత్ర గురించి మాత్రమే మాట్లాడుకోవాలని అనసూయ కామెంట్లు చేయడం గమనార్హం.

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అనసూయ హీరోహీరోయిన్లకు అమ్మ పాత్రల్లో నటించే అవకాశం ఉంది.ఈ ఏడాది అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమా విడుదలై బిలో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

Telugu Anasuya Bharadwaj, Heroines In Movies, Interesting Facts, Mother Characters-Movie

ప్రస్తుతం అనసూయ రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి.ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్న అనసూయ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.అనసూయ స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు వస్తే ఆ పాత్రలకు అస్సలు ఓ చెప్పడం లేదు.

డైరెక్టర్ సుకుమార్ సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను సొంతం చేసుకున్న అనసూయ పుష్ప మూవీతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు