ఏడ్చలేక నవ్వుతున్నా అంటూ మనసులోని బాధను బయటపెట్టిన యాంకర్ అనసూయ!

Anasuya Bharadwaj On Kalyan Krishna At Bangarraju Pre Release Event

బుల్లితెర జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

 Anasuya Bharadwaj On Kalyan Krishna At Bangarraju Pre Release Event-TeluguStop.com

సినిమాలలో కూడా మంచి మంచి పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే తాజాగా అనసూయ బంగార్రాజు ప్రీ ఈవెంట్ లో సందడి సందడి చేసింది.

నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయ ఒక కీలక పాత్రలో సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే.కానీ సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు సినిమాలో మాత్రం అనసూయ అవకాశం దక్కించుకోలేక పోయింది.

అయితే బంగార్రాజు సినిమా కి అనసూయ కి సంబంధం లేకపోయినా కూడా ఆమె ఈవెంట్ మీ హాజరయ్యింది.రాము బావ అంటూ సోగ్గాడే చిన్నినాయన సినిమా లో బుజ్జిగా అనసూయ అదరగొట్టింది.

ఇక స్టేజ్ పై బంగార్రాజు సినిమాల్లో తనకు ఎందుకు పాత్ర ఇవ్వలేదు అంటూ స్టేజ్ పైనే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ని నిలదీసింది.అయితే సినిమాలో అనసూయ పెట్టుకోకపోవడానికి చెప్పిన కారణమే ఇప్పుడు అందరి ముందు చెప్పమంటూ దర్శకుడికి ఆర్డర్ వేసింది.

అయితే చిన్న బంగార్రాజు కు పిన్ని పాత్ర అవుతుంది.ఏజ్ ఎక్కువగా చూపించాల్సి వస్తుంది.అని అలాంటి పాత్ర చేస్తారా అని అడిగాను.అందుకే వద్దన్నాను అంటూ కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు.

ఇక తన వద్ద మాత్రం కళ్యాణ్ కృష్ణ వేరే కారణం చెప్పాడని, ముసలి పాత్ర ఎందుకు లే నీకోసం సపరేట్ గా బుజ్జి అనే ఒక వెబ్ సిరీస్ చేద్దామంటూ బిస్కెట్ వేశాడు అని చెప్పుకొచ్చింది అనసూయ.అంత పెద్ద బిస్కెట్ ఎవరైనా చేస్తారా అంటూ సందడి సందడి చేసింది.ఏడవలేక ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాను.సినిమాలో నన్ను ఎందుకు పెట్టుకోలేదు అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను.నీ కల లోకి కూడా వస్తాను అంటూ దర్శకుడిని ఒక ఆట ఆడుకుంది అనసూయ.అనంతరం అనసూయ మాట్లాడుతూ సినిమా పై పాజిటివ్ గా కామెంట్ చేసింది.

సినిమా ట్రైలర్ ని నాలుగైదు సార్లు చూశాను అని చెప్పుకొచ్చింది.అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు అనసూయ తెలిపింది.

Video : Anasuya Bharadwaj On Kalyan Krishna At Bangarraju Pre Release Event, Anasuya Bharadwaj, Bangarraju, Kalyan Krishna, Pre Release Event

#Pre #Kalyan Krishna #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube