అనసూయతో విజయ్‌ దేవరకొండ మూవీ?  

Anasuya And Vijayadevarakonda Movie Latest Update - Telugu Anasuya And Vijayadevarakonda, Anasuya In Miku Matram, Anasuya Latest Update, E Cheputha, Tollywood Anchor Anasuya, Vijay Devarakonda Movie Update

విజయ్‌ దేవరకొండ ఒక వైపు హీరోగా నటిస్తు మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే మీకు మాత్రమే చెప్తా సినిమాను నిర్మించిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు మరో రెండు చిన్న చిత్రాలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

Anasuya And Vijayadevarakonda Movie Latest Update

అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్‌ మూవీగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూవీలో అనసూయ లీడ్‌ రోల్‌ను పోషించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విజయ్‌ దేవరకొండ బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తాలో ఈమె కీలక పాత్రలో కనిపించింది.ఇప్పుడు ఆమెను హీరోయిన్‌గా పెట్టి ఒక సినిమానే విజయ్‌ దేవరకొండ ప్లాన్‌ చేస్తున్నాడు.కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవ్వబోతున్నాడు.అనసూయకు స్క్రిప్ట్‌ బాగా నచ్చడంతో ఆమె స్వయంగా విజయ్‌ దేవరకొండకు సిఫార్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆ కథలో హీరోయిన్‌ కాస్త ముదురు వయసు.కనుక ఆ పాత్రకు అనసూయ అయితే బాగా సెట్‌ అవుతుందని, మూడు పదుల వయసు లేడీ పాత్రకు గాను అనసూయను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఒక సింగిల్‌ మదర్‌ పాత్రతో ఈ సినిమా నడుస్తుందని ఈ సందర్బంగా సమాచారం అందుతోంది.ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో కాని వచ్చే ఏడాదికి కాని వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు

Anasuya And Vijayadevarakonda Movie Latest Update-,anasuya In Miku Matram,anasuya Latest Update,e Cheputha,tollywood Anchor Anasuya,vijay Devarakonda Movie Update Related....